తెలంగాణ

ఇదీ రోడ్‌మ్యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: విజయ దశమి (అక్టోబర్ 11) నాటికి కొత్త జిల్లాల సంపూర్ణ ఆవిర్భావ ప్రక్రియ పూర్తవుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాంటిచారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సిఎం రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసి ప్రకటించారు. రెండు రోజులుగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లతో జరుగుతున్న వర్క్‌షాప్‌నకు బుధవారం సిఎం హాజరై మార్గనిర్దేశం చేశారు. ఈనెల 20లోపు కొత్త జిల్లాలపై కలెక్టర్లు సమగ్ర నివేదికను సిసిఎల్‌ఎ కమిషనర్ రేమాండ్ పీటర్‌కు అందించాలని సిఎం ఆదేశించారు. అలాగే ఈనెల 30లోగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత జూలై 5న కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలని సిఎం ఆదేశించారు. జూలై 10 లేదా 11తేదీల్లో ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఆగస్టు 4నుంచి 10తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా జారీ చేసి, నెల రోజులలోపు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది నివేదికను సిసిఎల్‌ఎ కమిషనర్, రెవిన్యూ శాఖ కార్యదర్శికి అందించాలన్నారు. తర్వాత అక్టోబర్ 11 విజయ దశమి నాటికి సంపూర్ణ ప్రక్రియ పూర్తిచేసి కొత్త జిల్లాల అవిర్భావం జరగాలని సిఎం ఆదేశించారు. దసరా నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి రానుండటంతో వాటికి సంబంధించిన కలెక్టరేట్, ఎస్పీ, రెవిన్యూ తదితర కార్యాలయాలు, వివిధ విభాగాలు, వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన నివేదికలనూ ఈనెల 20లోపు తెప్పించుకోవాలని సిఎం ఆదేశించారు. వాహనాలు, భవనాలపై కూడా నివేదికలు తయారు చేయాలన్నారు. జిల్లాల కార్యనిర్వహణ యంత్రాంగం తీరుతెన్నులు పరిశీలించి జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌ఓలు, పిడీలు, ఈడీలు, డిడిలవంటి జిల్లా అధికారులు, వారి కింద పనిచేసే ఇతర అధికారులు, ఉద్యోగుల వివరాలతో నివేదికలు తయారు చేయాలని సిఎం సూచించారు. కొత్త జిల్లాలకు అనుభవం ఉన్నవారినే కేటాయించాలని, పాత జిల్లాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేసుకోవాలని సిఎం ఆదేశించారు.