S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/07/2016 - 07:44

హైదరాబాద్, జూన్ 6: మూడేళ్లుగా రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరుచేసుకుంటూ పోతున్నా, అక్కడ పనిచేయాల్సిన బోధన సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో అటెండర్ నుండి ప్రిన్సిపాల్ పదవి వరకూ అంతా తాత్కాలిక పద్ధతిలో పనిచేయాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 128 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. అందులో ఐదు కాలేజీలు మాత్రమే నేక్‌తో గుర్తింపు పొంది ఏ గ్రేడ్ సంపాదించాయి.

06/07/2016 - 07:43

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన వ్యవసాయ విస్తరణాధికారుల ఎంపిక పరీక్ష ప్రాధమిక కీని సోమవారం నాడు విడుదల చేసినట్టు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. పరీక్షకు హాజరైన వారికి అభ్యంతరాలుంటే వాటిపై తమ సమాచారాన్ని 8వ తేదీలోగా పంపించాలని అన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది కీ ఖరారుచేస్తామని చెప్పారు.

06/07/2016 - 07:42

హైదరాబాద్, జూన్ 6: మద్యం కంపెనీలకు నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ తెలుగుదేశ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ నగరంలోని పలు బస్తీల్లో తాగేందుకు నీళ్లు లేక అలమటిస్తుంటే.. మద్యం కంపెనీలకు ఎలా సరఫరా చేస్తారని ఆయన ప్రశ్నించారు.

06/07/2016 - 07:42

హైదరాబాద్, జూన్ 6: కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జెనీవాలో 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ కార్మికుల సదస్సుకు హాజరయ్యేందుకు దత్తాత్రేయ నేతృత్వంలో ప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్ళింది.

06/07/2016 - 07:41

హైదరాబాద్, జూన్ 6:మిఊన్ కాకతీయ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న పలువురు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు. జిల్లాల్లో మిషన్ కాకతీయ పథకం కింద చెరువును పునరుద్ధరణ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు కొందరు అగ్రిమెంట్లు చేసుకోవడానికే ముందుకు రావడం లేదు, కొన్ని చోట్ల మందగొడిగా పని చేస్తున్నారు.

06/07/2016 - 07:40

హైదరాబాద్, జూన్ 6: కార్బైడ్ పూసిన పళ్లను మార్కెట్‌లో అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ హైకోర్టు తామిచ్చిన ఆదేశాలను పాటించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన అధికారులను నిలదీసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అధికారుల వివరణ కోరింది.

06/07/2016 - 07:40

హైదరాబాద్, జూన్ 6: అమరవీరుల త్యాగాలు నిత్య స్మరణీయాలని, ఆటుపోట్లతో ఉద్యమం మొదలై ఆత్మహత్యలు చేసుకుంటేనేకానీ రాష్ట్రావతరణకు అంకురార్పణ జరగలేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారిస్తే సరిపోదని అమరవీరుల కుటుంబాలను మర్చిపోకూడదని సూచించారు.

,
06/07/2016 - 07:33

కరీంనగర్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేస్తున్న విమర్శలు దుమారాన్ని రేపుతున్నాయ. ఈ విమర్శలపై పలువురు మంత్రులు తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. సీమాంధ్రుల కుట్రల్లో భాగంగానే కోదండరామ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.

06/07/2016 - 07:27

తొగుట, జూన్ 6: ప్రాజెక్టులు నిర్మించే ముందు వాటి వల్ల కలిగే లాభనష్టాలపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని, ప్రజాభిప్రాయం మేరకు భూసేకరణ చేపట్టాలని టిజెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బలవంతంగా భూసేకరణ చేపట్టడం చట్టసమ్మతం కాదని ఆయన స్పష్టం చేశారు.

06/07/2016 - 07:26

జగదేవ్‌పూర్, జూన్ 6: గుర్తు తెలియని ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైన సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ ఆలయం వద్ద సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈసంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Pages