తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8 : మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, బీమీ లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులను రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. జూలై 31 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో 4,50,000 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. ఈ కారణంగానే పనులు కొనసాగుతున్న లిఫ్ట్‌లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వివిధ పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో భూమి కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిలో ఏవైనా అడ్డంకులు ఎదురవుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ సిబ్బంది కలిసి పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అక్విడక్ట్‌లు, బ్రిడ్జిలు, ఇన్‌స్పెక్షన్ పాత్‌లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మహాత్మాగాంధీ, భీమా లిప్ట్ పథకాల్లో వివిధ ప్యాకేజీలలో ఫీల్డ్ ఛానెల్స్‌ను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల కింద జరుగుతున్న పనులను ఈ నెల 11 నుండి 13 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.