S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/07/2016 - 17:58

హైదరాబాద్: తెరాస పార్టీ వల్లే రాజకీయ జెఎసి ఆవిర్భవించిందని, ప్రొఫెసర్ కోదండరామ్‌ను జెఎసి చైర్మన్‌గా చేసింది కెసిఆర్ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. విపక్షాల మాదిరి కెసిఆర్ సర్కారును కోదండరామ్ విమర్శించడం సరికాదన్నారు. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి ఆయన విమర్శలు చేస్తున్నారన్నారు.

06/07/2016 - 17:57

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని నగరంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో విస్తారంగా వానలు కురుస్తాయి గనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉంది.

06/07/2016 - 17:55

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు ఇష్టానుసారం మాట్లాడడం తగదని నిరుద్యోగ జెఎసి విమర్శించింది. మంత్రులు ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జెఎసి డిమాండ్ చేసింది. ఓయులోని ఆర్ట్సు కళాశాల వద్ద నిరుద్యోగ జెఎసి మంగళవారం ఆందోళన చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

06/07/2016 - 17:54

హైదరాబాద్: తెలంగాణ సర్కారు నుంచి తనకు ముప్పు ఉన్నందున భద్రత పెంచాలని టి.టిడిపి నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయమై నివేదిక ఇచ్చేందుకు వారం రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రేవంత్‌కు భద్రత కల్పించేందుకు ఉన్న అభ్యంతరాలేమిటో తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

06/07/2016 - 15:27

దిల్లీ: తెలంగాణ ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్‌రావు మంగళవారం ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఆయన వెంట తెరాస ఎంపీలు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అధికారులున్నారు. కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలు, తెలంగాణకు నీటి వాటా తదితర విషయాలపై హరీష్ చర్చించారు.

06/07/2016 - 15:26

హైదరాబాద్: తెలంగాణలో జెఎసిని అంతం చేయడమే తెరాస లక్ష్యంగా కనిపిస్తోందని టిటిడిపి నేత రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో చెప్పారు. రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడంతో తెలంగాణ మంత్రులు చిత్తకార్తె కుక్కల్లా ఆయనపై దాడి చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలు, కరవు వంటి విషయాలపై కోదండరామ్ యాత్రలు చేశాకే కెసిఆర్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించిందన్నారు.

06/07/2016 - 15:26

ఆదిలాబాద్: ఎవరేమి అనుకున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాడితీరతామని రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం స్పష్టం చేశారు. తనపై తెరాస నేతలు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న విమర్శలపై ప్రస్తుతానికి స్పందించలేనని, బుధవారం జెఎసి స్టీరింగ్ కమిటీలో చర్చించాకే ఆ విషయాలు మాట్లాడతానని అన్నారు. జెఎసి సమావేశంలో ప్రాధాన్యతల మేరకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.

06/07/2016 - 15:23

హైదరాబాద్: తెలంగాణను పరిపాలించాలని తెరాస పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టగా, సిఎం పదవి నుంచి కెసిఆర్ తప్పుకోవాలని అడగడానికి కోదండరామ్ ఎవరని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ప్రశ్నించారు. కోదండరామ్ వెనుక కొంత మంది బాసులున్నారని, తమకు మాత్రం ప్రజలే బాసులని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు మద్దతుగా కోదండ పనిచేశారా? అని ఆయన ప్రశ్నించారు.

06/07/2016 - 15:21

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంతో మమేకమైనవారికి బదులు తెలంగాణ ద్రోహులకు సిఎం కెసిఆర్ పదవులు కట్టబెడుతున్నారని ఉద్యమవేదిక నేతలు చెరుకు సుధాకర్, ఎన్నం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆరోపించారు. తన ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వారికి కెసిఆర్ అందలం ఎక్కిస్తున్నారని వారు అన్నారు.

06/07/2016 - 07:46

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణలో న్యాయవిద్యను అభ్యసించేందుకు నిర్వహించిన మూడు ప్రవేశపరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాకతీయ యూనివర్శిటీ ఇన్‌ఛార్జి విసి చిరంజీవులు, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం వి రంగారావులు విడుదల చేశారు. మూడేళ్ల కోర్సునకు మూడేళ్ల లాసెట్ ఐదేళ్ల కోర్సునకు ఐదేళ్ల లాసెట్, పిజి కోర్సులకు ఎల్‌ఎల్‌ఎం పరీక్షను గత నెల 24వ తేదీన నిర్వహించారు.

Pages