S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/10/2016 - 08:33

వరంగల్, జూన్ 9: దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఒక అసమర్ధుడి చేతిలో ముఖ్యమంత్రి పదవి పెట్టినట్లయిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెండేళ్ల పాలనపై ఆయన మండిపడ్డారు. సిఎం పాలన కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఆయన విమర్శించారు.

06/10/2016 - 08:31

జనగామ, జూన్ 9: జనగామ జిల్లా రాదనే వ్యథతో ఒక యువకుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా జనగామ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎండి. జహంగీర్ (32) గురువారం మధ్యాహ్నం వరకు జనగామ చౌరస్తాలో జరిగిన రాస్తారోకోలో పాల్గొని రాత్రికి ఇంటికి వచ్చాడు.

06/10/2016 - 08:31

సంగారెడ్డి, జూన్ 9: వ్యవసాయం కోసం నీటి ప్రాజెక్టులు, ఉపాధి కోసం పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిన పథకాల్లో వేలాది ఎకరాల భూమి కనుమరుగు కానుండగా, ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారంపై అన్నదాతలు అలకపాన్పునెక్కారు. బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు రంగప్రవేశం చేయడంతో లాభం మాట దేవుడెరుగుకానీ ప్రభుత్వం మాత్రం పిసరంత కూడా స్పందించడం లేదు.

06/10/2016 - 08:30

మహబూబ్‌నగర్, జూన్ 9: టిజెఎసి చైర్మన్ కోదండరాంపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ జెఎసి విద్యార్థులు భగ్గుమన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బోగారం గ్రామంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి మంత్రి జూపల్లి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓయూ జెఎసి విద్యార్థులు కొందరు భోగారం గ్రామానికి చేరుకున్నారు.

06/10/2016 - 08:30

వినాయక్‌నగర్, జూన్ 9: కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో నిజామాబాద్ జిల్లా కారాగారంలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న రఫీక్ అనే వ్యక్తి గురువారం మృతి చెందినట్లు రూరల్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దోమకొండ మండలానికి చెందిన రఫీక్ అనే వ్యక్తికి భార్యను హత్య చేసిన కేసులో 2010లో న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది.

06/10/2016 - 08:29

హైదరాబాద్, జూన్ 9: పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా రణం జ్యోతిని నియమించారు. మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్ బాపురెడ్డి, మహబూబ్‌నగర్ చైర్మన్‌గా చెరుకుపల్లి రాజేశ్వర్‌లను నియమించారు. గత మూడు రోజుల నుంచి వరుసగా మార్కెట్ కమిటీల పాలక వర్గాలను నియమిస్తున్నారు.

06/10/2016 - 08:28

నల్లగొండ, జూన్ 9: పార్టీలు మారే వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయాలంటూ నిన్నటిదాకా అందరికీ నీతులు చెప్పిన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా రేపు పార్టీ మారి టిఆర్‌ఎస్‌లో చేరితే ఎంపి పదవికి రాజీనామా చేయాలని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

06/10/2016 - 08:11

హైదరాబాద్, జూన్ 9: గోదావరి నదిపై మేడిగడ్డ దగ్గర తెలంగాణ ప్రభుత్వం నిర్మించే బ్యారేజీకి మహారాష్ట్ర ప్రభుత్వం హైడ్రాలజీ అనుమతులకు క్లియరెన్స్ ఇచ్చింది. మహారాష్ట్ర సిఇ సాహేబ్ తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిపారు. ఈ అనుమతితో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన అంకం పూర్తయింది. మేడిగడ్డ అంతర్ రాష్ట్ర బ్యారేజీ. ఇది రెండు రాష్ట్రాల పరిధిలో ఉంది.

06/10/2016 - 08:11

హైదరాబాద్, జూన్ 9: కరీంనగర్ జిల్లాలో కరవు మండలాలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో రెండు వారాలలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరవు మండలాల ఎంపికపై నియమించిన కమిటీ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

06/10/2016 - 08:10

హైదరాబాద్, జూన్ 9: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) పరిధిలో భవనాలు, ఇండ్లు నిర్మించే సమయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలన్న విషయమై నియమించే కమిటీ వివరాలను సమర్పించాలని హైకోర్టు గురువారం జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. హైకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది.

Pages