తెలంగాణ

25వేల రియాల్స్‌కు నన్ను అమ్మేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: పేదరికం ఆమె పాలిట శాపమైంది. భర్త ఆకస్మిక మరణంతో రోడ్డున పడిన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం పరిచయస్తులను ఆశ్రయిస్తే ఏకంగా సౌదీ అరేబియాకు అమ్మేశారంటూ నగరానికి చెందిన బాధిత మహిళ కంట తడిపెట్టింది. సౌదీ అరేబియాలో కుట్టు, ఎంబ్రాయిడరీ, మెహందీ.. ఇలా ఇతర పనుల కోసం సౌదీ అరేబియా వెళ్లిన 18మంది మహిళలను అక్కడ షేక్‌ల వేధింపులకు గురి చేశారు. షేక్‌ల వేధింపుల నుంచి చాకచాక్యంగా తప్పించుకుని భారత రాయబార కార్యాలయం సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు బాధిత మహిళలు.
ఉపాధి కల్పిస్తామని నగరానికి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ఆశ చూపి, తనను 25వేల రియాల్స్‌కు సౌదీకి అమ్మేశారని, ఇలాంటి బోగస్ ఏజెన్సీలను నమ్మొద్దంటూ బాధిత మహిళల్లో ఒకరైన ఉస్నాబేగం కంటతడి పెట్టింది. సంఘటనకు సబంధించి బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయ. నగరంలోని హాసన్‌నగర్‌కు చెందిన ఉస్నాబేగం భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. కొడుకు, కుటుంబాన్ని పోషించుకోవటం ఆమెకు గగనమైంది. ఏదైనా ఉద్యోగం కోసం తనకు పరిచయమున్న మహిళను సంప్రదించింది. సౌదీలో ఎంబ్రాయిడింగ్, జిగ్‌జాగ్, టైలరింగ్, మెహింది, పికోపాల్ వంటి పనులు చేసుకోవచ్చని చెప్పి, ఉస్నాను తనకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నెల క్రితం సౌదీకి పంపింది. సౌదీలో ఉద్యోగం లభించటంతో ఇక్కడినుంచి ఎంతో ఆనందంగా వెళ్లిన ఉస్నా, అక్కడకు చేరుకోగానే కేవలం గంటల వ్యవధిలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. అక్కడి షేక్‌లు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని, ఇంటి పనితోపాటు వ్యభిచారం చేయాలంటూ నిర్బంధించారని ఆమె వాపోయంది. వారు చెప్పిన పనులు చేయని తనను గదిలో వేసి బంధించగా, ఒకసారి తప్పించుకునేందుకు ప్రయత్నించి దొరికితే అనేక రకాల చిత్రహింసలకు గురి చేశారని చెబుతోంది. తర్వాత కూడా తనను గదిలో బంధించగా, అతి కష్టంగా తప్పించుకుని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించానని, అక్కడి అధికారుల సహాయంతో స్వదేశానికి చేరుకున్నట్లు ఉస్నా వివరించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఉస్నాను ట్రావెల్స్ ఏజెన్సీకి పరిచయం చేసిన మహిళ, ఏజెన్సీ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
15రోజుల క్రితమే తల్లి ఆబేద ఫిర్యాదు
సౌదీలో ఉస్నా వేధింపులకు గురవుతున్నట్లు తెలుసుకున్న ఉస్నా తల్లి అబేదా బేగం ఆమెను సౌదీకి పంపిన ట్రావెల్స్ ఏజెన్సీపై ముంబై అర్బన్‌లోని కుర్లా పోలీస్‌స్టేషన్‌లో గత నెల 25న ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు భారత రాయబారి కార్యాలయంతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతూ బాధిత మహిళలు సురక్షితంగా బయటపడేందుకు సహకరించారు.