తెలంగాణ

ఆస్తిపన్ను చెల్లిస్తే వడ్డీ మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆస్తిపన్ను బకాయిలను చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని, సకాలంలో పన్ను చెల్లించినట్టయితే నగదు బహుమతులు అందజేస్తామని జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఇక్కడ మంగళవారం జరిగిన జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. జూలై 11న హరితహారం సందర్భంగా నగరంలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటుతామని, పచ్చదనం-పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలను తవ్వాలని ఆయన నగరవాసులను కోరారు. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. భారీవర్షాలు, గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.