S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/12/2016 - 03:56

హైదరాబాద్, జూలై 11 : హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి (ఎస్‌డిఇ) దవాఖానాలోని ఒక ఆపరేషన్ థియేటర్‌లో జూన్ 30 న జరిగిన కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటనపై లోకాయుక్త తన విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. లోకాయుక్త జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సంస్థ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్స్ విచారణ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ తమ నివేదికను సోమవారం లోకాయుక్తకు అందించారు.

07/12/2016 - 03:56

హైదరాబాద్, జూలై 11: ఐఎస్‌ఎస్ ఉగ్రవాదుల 12 రోజుల కస్టడీ మంగళవారంతో ముగియనుంది. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది సానుభూతిపరులను గత నెల 28న ఎన్‌ఐఏ, నగర పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరుగురిని విచారించి వదిలేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో ఐదుగురిని తమ కస్టడీకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ జరిపారు.

07/11/2016 - 06:50

కొత్తగూడెం, జూలై 10: మిషన్ భగీరధ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లానీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వాటర్‌గ్రిడ్ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

07/11/2016 - 06:49

హైదరాబాద్, జూలై 10: రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డు సిబ్బందితో తన ఇంట్లో వంటపని, దొడ్డిచావిడి పనులు చేయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ ఇన్‌చార్జి డిజిపి అంజనీకుమార్ ఆదేశానుసారం హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన బృందం కేసు దర్యాప్తు జరుపుతోంది.

07/11/2016 - 06:48

హైదరాబాద్,జూలై 10: గోదావరిపై నిర్మించబోయే నీటిపారుదల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో మరో ఒప్పందం కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 15న ముంబాయి వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివీస్‌తో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భేటీ కావాల్సి ఉండగా, ఈ కార్యక్రమం మూడవ వారానికి వాయిదా పడినట్టు అధికార వర్గాల సమాచారం.

07/11/2016 - 06:47

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ త్వరలో కొత్త బస్సులు కొనుగోలు చేయనుంది. రూ.350 కోట్లతో 1200 బస్సులు కొనుగోలు చేస్తారు. వీటిలో 150 ఏసి బస్సులతోపాటు మినీ బస్సులు ఉంటాయని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసీ రూ.700 కోట్లతో నడుస్తుందని, నష్టాల నుంచి అధిగమించేందుకు ఇటీవల బస్సు చార్జీలను పెంచడం జరిగిందన్నారు.

07/11/2016 - 06:46

హైదరాబాద్, జులై 10: సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, టి. హరీష్ రావు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. దిగ్విజయ్ అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేశారని భట్టివిక్రమార్క ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

07/11/2016 - 06:46

హైదరాబాద్, జులై 10: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు, ఎమ్మెల్యే కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి త్వరలో రైతు దీక్ష చేపట్టబోతున్నారు. రైతులకు మూడో విడత రుణ మాఫీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

07/11/2016 - 06:13

హైదరాబాద్, జూలై 10: హరిత హారాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడితే కొందరు ప్రజాప్రతినిధులు ఆంటీ ముట్టనట్టు ఉండడంపై సిఎం కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. నియోజక వర్గాల వారీగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యత అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం.

07/11/2016 - 06:12

సిద్దిపేట, జూలై 10: ఆ గ్రామం ఎన్నింటిలోనో ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఆవార్డులు కైవసం చేసుకుంది. ఇప్పుడు కొత్త రకం నోము నోచింది. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి లక్ష మొక్కల నోము నోచారు. అదో మహానగరం కాదు, పట్టణం కాదు కనీసం మేజర్ పంచాయితీ కూడా కాదు. దాదాపు రెండు వందల గడపలతో వెయ్యి లోపే ఉన్న గ్రామం. గ్రామం చిన్నదే కానీ మనసు పెద్దది.

Pages