తెలంగాణ

సిఎం కెసిఆర్ ప్రైవేట్ నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: హరిత హారాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడితే కొందరు ప్రజాప్రతినిధులు ఆంటీ ముట్టనట్టు ఉండడంపై సిఎం కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. నియోజక వర్గాల వారీగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యత అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. అధికారిక నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూనే, మరోవైపు ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలతో తెలంగాణకు దేశంలోనే మంచి గుర్తింపు లభిస్తుండగా, కొందరు ప్రజాప్రతినిధులు ఇది తమకు సంబంధం లేని కార్యక్రమం అన్నట్టుగా దూరంగా ఉండడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నా, కొందరు దూరంగానే ఉంటున్నారు. విపక్షాల శాసన సభ్యులు దూరంగా ఉండడం వేరు, కానీ అధికార పక్షం ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం సహించరానిదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది, ఎమ్మెల్యేలు ఇది గమనించకుండా తమకు సంబంధం లేదని భావించడం సహించరానిదని, హరితహారానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వాలని ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యత అప్పగించారు.
ప్రజలు సైతం ఇది తమ కార్యక్రమంగా భావించి ఇంటింటికి మొక్కలు నాటుతుంటే ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారు. మొక్కలు పెంచడం, వాటిని పరిరక్షించడంపై ప్రజాప్రతినిధులు ఏ విధంగా శ్రద్ధ చూపుతున్నారో ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏ రోజు ఏ ఎమ్మెల్యే హరిత హారంలో ఎక్కడ పాల్గొన్నారు, హరిత హారంకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై ప్రైవేటు ఏజెన్సీ ప్రతి రోజు ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తుంది. మొత్తం 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. గత సంవత్సరం వర్షాలు కురవక పోవడంతో హరిత హారం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈసారి మంచి వర్షాలు ఉన్నందున ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా హరిత హారంలోను విజయవంతం చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.