తెలంగాణ

మొక్కవోని దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 10: ఆ గ్రామం ఎన్నింటిలోనో ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఆవార్డులు కైవసం చేసుకుంది. ఇప్పుడు కొత్త రకం నోము నోచింది. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి లక్ష మొక్కల నోము నోచారు. అదో మహానగరం కాదు, పట్టణం కాదు కనీసం మేజర్ పంచాయితీ కూడా కాదు. దాదాపు రెండు వందల గడపలతో వెయ్యి లోపే ఉన్న గ్రామం. గ్రామం చిన్నదే కానీ మనసు పెద్దది. ఏదైనా మన లక్ష్యం పెద్దగా ఉండాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు ఒకే రోజు లక్ష మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ఇది సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామస్తుల సమిష్టి విజయ గాథ. గత ఏడాది వర్షాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు ఎండిపోతే ఈ గ్రామంలో 40వేల మొక్కలు నాటితే వాటిలో 35వేల మొక్కలు చక్కగా ఎదిగాయి. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మురికినీటికి ఇంకుడు గుంత, ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు తప్పని సరి కనిపిస్తుంది. మురికినీరు భూమిలో ఇంకిపోయే విధంగా నూతన విధానంలో ఇంకుడు గుంతలు నిర్మించారు. మొత్తం గ్రామంలో హరిత హారం కింద రెండు లక్షల 10వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ ఒక్కరోజే లక్షా ఐదువేల మొక్కలు నాటారు. ఈలాఖరునాటికి మిగిలిన మొక్కలు నాటుతారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్న ఈ గ్రామం తన ప్రత్యేకత చాటుకుంటోంది. గ్రామంలో భూ గర్భ జలాలు, పొరుగున ఉన్న ఇతర ప్రాంతాల్లో భూ గర్భ జలాల మట్టానికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజక వర్గం మారుమూల గ్రామమైన ఇబ్రహీంపూర్ లక్ష మొక్కలు నాటి మరోసారి చరిత్ర పుటల్లో ఎక్కింది. జోరువానను సైతం లెక్క చేయకుండా ఆదివారం హరిత ఉద్యమం స్పూర్తితో ఇబ్రహీంపూర్ గ్రామస్తులు చేయి, చేయి కలిపి లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. గ్రామాస్తులు గత మూడు రోజులు సుమారు 500 ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు కలసి లక్ష మొక్కల కోసం గుంతలు తవ్వి సిద్దం చేశారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి వంద గుంతలు తవ్వడంతో పాటు, మొక్కలు నాటి, వాటిని సంరక్షణకు నడుం బిగించారు. గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఒక వంద చెట్లు పెంచాలని లక్ష్యం నిర్ణయించుకున్నారు. చేసి చూపించారు.