S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/14/2016 - 07:28

నల్లగొండ, జూలై 13: భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, మునుగోడు నియోజకవర్గం మాజీ హాట్రిక్ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు (90) బుధవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉ. 5.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.

07/14/2016 - 07:27

సంగారెడ్డి, జూలై 13: మెదక్ జిల్లా తొగుట, కొండపాక మండలాల పరిధిలో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ వివాదం మరింత రాజుకుంది. మంగళవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన కొంతమంది గ్రామస్తులతో చర్చలు జరిపి 6 లక్షలకు ఎకరం చొప్పున భూములు ఇస్తామంటూ అంగీకరించడంతో గ్రామంలో మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

07/14/2016 - 07:26

సంగారెడ్డి, జూలై 13: వర్షాకాలం ప్రారంభమై నలబై రోజులు గడుస్తున్నా జిల్లాలో ఉన్న ఏకైక నది మంజీరలోకి చుక్క నీరు రాకపోవడంతో మూగబోయింది. మూడు దశాబ్దాల కాలంగా ఎన్నడూ ఎండిపోని సింగూర్ ప్రాజెక్టులో అడుగంటిన నీటితో కళావిహీనంగా దర్శనమిస్తూ చిన్నబోయి కూర్చుంది.

07/14/2016 - 07:20

భద్రాచలం, జూలై 13: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. బుధవారం ప్రశాంతంగా కనిపించింది. గరిష్టంగా 52.4 అడుగులకు చేరుకున్న గోదావరి మంగళవారం రాత్రి నుంచే తగ్గుముఖం పట్టింది. క్రమేణా తగ్గుతూ నీటిమట్టం కనిష్ట స్థాయిలకు చేరుకోవడంతో ఐటీడీఏ పీఓ, ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రెండు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు.

07/14/2016 - 07:13

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారన్న హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మంగళ, బుధవారాల్లో నిర్వహించిన తనిఖీల్లో 136 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

07/14/2016 - 07:12

హైదరాబాద్, జూలై 13: సచివాలయంలో బుధవారం సమావేశమైన కమలనాథన్ కమిటీ సమావేశం తెలంగాణ ఉద్యోగుల ఆందోళనతో అర్ధాంతరంగా వాయిదా పడింది. వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్ధకశాఖ, ప్రజారోగ్యశాఖలకు చెందిన సెక్షన్ ఆఫీసర్స్ (ఎస్‌ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఎఎస్‌ఓ) ఉద్యోగుల విభజనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కమలనాథన్ కమిటీ సమావేశం అయింది.

07/14/2016 - 06:56

హైదరాబాద్, జూలై 13: తలలు అంటుకుని జన్మించిన అవిభక్త కవలలను నిలోఫర్ ఆసుపత్రి నుంచి యూసుఫ్‌గూడ ఎల్లారెడ్డిగూడలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తోన్న స్టేట్‌హోంకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

07/14/2016 - 06:43

హైదరాబాద్, జూలై 13 : రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన సరోజినీదేవి కంటి దవాఖానాలో ఇటీవల జరిగిన కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటన చివరకు ‘హసీబ్’ కంపెనీపై వేటు వేసేందుకు దారి తీస్తోంది. ఈ సంఘటనపై రెండు కమిటీలు వేర్వేరుగా విచారణ జరిపి, నివేదికలను ప్రభుత్వానికి అందచేశాయి. ఈ రెండు నివేదికలు ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీకి చేరాయి.

07/13/2016 - 08:30

తొగుట, జూలై 12: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేదిలేదని..గ్రామస్థులను సంప్రదించకుండా నాయకులు ఒప్పుకుంటే తాము ఎలా భూములు ఇస్తామని ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని ముంచేందుకు నాయకులు ఒప్పుకున్నారని ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామంలో మహిళలు నేతలను నిలదీసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది.

07/13/2016 - 08:29

హైదరాబాద్, జూలై 12: నీటి పారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాల్సిందిగా స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి లేఖ రాయనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీయం కెసిఆర్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చినప్పుడు తమకూ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.

Pages