S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

,
07/12/2016 - 04:49

హైదరాబాద్, జూలై 11: భాగ్యనగరానికి లక్షలాది మంది ప్రజలు ఒకేసారి పచ్చబొట్టు పెట్టినట్టుగా అపురూప దృశ్యం మహానగరంలో ఆవిష్కృతమైంది. పాఠశాల పిల్లలు పెద్దలు అంతా మొక్కల పండుగ జరుపుకున్నట్టుగా కోలాహలంగా, సర్వమత పండుగలా భాగ్యనగరం కనిపించింది. కోటి జనాభా ఉన్న రాజధాని నగరంలో ఒకే రోజుపాతిక లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం విజయవంతం అయింది.

07/12/2016 - 04:45

సంగారెడ్డి, జూలై 11: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, నాటిన మొక్కలను సంరక్షించాలని రాష్ట్ర గవర్నర్ ఇసిఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం పటన్‌చెరు నియోజకవర్గం బిహెచ్‌ఇఎల్ కంపెనీలో గవర్నర్ మొక్కలు నాటారు.

07/12/2016 - 04:42

వెల్దండ, జూలై 11: పంటను అడవి పందుల బారి నుండి రక్షించుకునేందుకు ఓ రైతు పొలం దగ్గర పెట్టిన కరెంట్ షాక్‌కు కుందేళ్లు పట్టేందుకు వేటకు వెళ్లిన వేటగాడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శిరోనిబావితండాలో జరిగింది. వెల్దండ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

07/12/2016 - 04:39

తొగుట, జూలై 11: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సమ్మతిస్తు భూములు అప్పగించేందుకు మెదక్ జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్ గ్రామస్థులు అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో అంగీకరించారు. సర్పంచ్ పిట్ల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్థులు సోమవారం తొగుటకు చేరుకొని ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో ప్రాజెక్టుకు గ్రామస్థులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

07/12/2016 - 04:33

హైదరాబాద్, జూలై 11: హోంగార్డులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ సోమవారం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యారు. తన కార్యాలయంలో జరిగిన ఘటనపై ఆయన నివేదిక ఇచ్చారు.

07/12/2016 - 04:33

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల విద్యార్ధులు పాల్గొని సోమవారం నాడు దాదాపు పది లక్షల మొక్కలు నాటారు. ప్రభుత్వం సైతం ఊహించని స్పందన విద్యాసంస్థల నుండి దక్కింది.

07/12/2016 - 04:32

హైదరాబాద్, జూలై 11: ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా కోటి మొక్కలు నాటుతారు. దీనికి సంబంధించి పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/12/2016 - 04:31

మునుగోడు, జూలై 11: ఎటిఎంలలో డబ్బులు పెట్టి మరో ఎటిఎంలో డబ్బులు సమకూర్చేందుకు వెళ్తున్న నల్లగొండ రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ సిబ్బందిని ఆగంతులు పథకం ప్రకారం అనుసరించి కంట్లో కారం చల్లి దాడి చేసి వారి వద్ద ఉన్న 32 లక్షల నగదును చోరీ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

07/12/2016 - 04:04

హైదరాబాద్, జూలై 11: బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి పేర్కొన్నారు. పాతబస్తీ మహంకాళీ దేవాలయంలో జరిగే బోనాల ఉత్సవాల బ్రోచర్‌ను రమణాచారి సచివాలయంలో సోమవారం ఆవిష్కరించారు. అక్కన్నమాదన్న దేవాలయం కార్యనిర్వాహక వర్గం గత 68 ఎళ్ల నుంచి పవిత్రంగా ఉత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు.

07/12/2016 - 03:57

హైదరాబాద్, జూలై 11: సరోజనిదేవి కంటి ఆస్పత్రిలో శస్తచ్రికిత్సల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఎబివిపి మానవ హక్కుల సంఘానికి సోమవారం విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం, వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం ఉందని వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప కోరారు.

Pages