S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/10/2016 - 08:06

మహబూబాబాద్, జూలై 9: వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు-మానుకోట రైల్వే స్టేషన్‌ల మధ్య అప్‌లైన్‌లో వెల్డింగ్ ఊడి రైలు పట్టా విరగడంతో శనివారం పలు రైళ్ల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. వెల్డింగ్ విడిపోయిన అంశాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి దాన్ని సరిచేశారు. దీంతో తిరిగి రైళ్లు యథాతథంగా నడిచాయి.

07/10/2016 - 08:05

న్యూఢిల్లీ, జూలై 9: తెలంగాణలో ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏఏ ప్రలోభాలకు గురిచేసిందీ త్వరలో బయటపెడతానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం నాడు ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం పొంగులేటి విలేఖరులతో మాట్లాడుతూ వర్షాకాల సమావేశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణను ఆమోదించాలని రాహుల్‌ని కోరనన్నారు.

07/10/2016 - 07:34

హైదరాబాద్, జూలై 9: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా 60 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 210 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ముందుగా పది మోడల్ జంక్షన్లు అభివృద్ధి చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్డు జంక్షన్ల అభివృద్ధిపై సచివాలయంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు శనివారం సమీక్షించారు.

07/10/2016 - 07:35

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణకు తమ ప్రభత్వం ఎల్లవేళలా ముందుంటుందన్నారు. శనివారం ఆర్టీసీ టిఎస్ ఎన్‌ఎంయూ అదనపు జాయింట్ సెక్రటరీ కావలి హన్మంతు, వర్కింగ్ ప్రెసిడెంట్ కమాల్‌రెడ్డి తదితరులు మంత్రి నివాసంలో కలసి ఒక వినతిపత్రం సమర్పించారు.

07/10/2016 - 07:28

హైదరాబాద్, జూలై 9: మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేయడంలో విపక్షాలు వెనుకబడ్డాయి. బాధిత రైతు కుటుంబాలకు అండగా మేమున్నాం అంటూ తొలుత టిడిపి, కాంగ్రెస్, బిజెపి నేతలు ఉప్పెనలా ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఆ విషయానే్న మరిచారు. ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి 48 గంటల పాటు దీక్ష నిర్వహించి, రైతులకు ధైర్యం చెప్పారు.

07/10/2016 - 07:26

హైదరాబాద్, జూలై 9: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ విమర్శించారు. ఎఐసిసినేత దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ ప్రభుత్వంపైన, టిఆర్‌ఎస్‌పైనే అసందర్భ విమర్శలు చేస్తున్నారని అన్నారు. రెండేళ్ల తెలంగాణ పాలన గురించి మాట్లాడే ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం సాధించారో చెప్పాలని, దోచుకోవడం మినహా కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదని అన్నారు.

07/10/2016 - 07:26

హైదరాబాద్, జూలై 9: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ట్రైనింగ్ (సిపెట్) ఆధ్వర్యంలో దేశంలో అతి పెద్ద ప్లాస్టిక్ శిక్షణ పరిశోధన సంస్ధను మెదక్ జిల్లా రుద్రారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు సిపెట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. భవన నిర్మాణానికి కేంద్రం రూ. 50 కోట్లు కేటాయించిందన్నారు.

07/10/2016 - 07:25

హైదరాబాద్, జూలై 9: ఎస్‌సి వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఢిల్లీలో 25 రోజుల పాటు వేల డప్పు వాయిద్యాలు మోగించి వినూత్న పద్ధతిలో ఆందోళనలు నిర్వహించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

07/09/2016 - 17:45

మహబూబ్‌నగర్‌: భూనిర్వాసితుల దీక్షకు సీపీఎం నేత తమ్మినేని సంఘీభావం తెలిపారు. బలవంతంగా భూములు లాక్కోవొద్దని తమ్మినేని అన్నారు. కొల్లాపూర్‌ మండలం కుడికిల్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల దీక్షలు 48 రోజులకు చేరాయి. జీవో నెం.123 వెంటనే రద్దు చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

07/09/2016 - 17:34

హైదరాబాద్‌: జీడిమెట్ల గాజుల రామారం 329 సర్వే నెంబర్‌లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ఆలయం కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Pages