S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/09/2016 - 17:13

కరీంనగర్: ఫైనాన్స్ వ్యాపారి పెడుతున్న వేధింపులు తాళలేక హుజూరాబాద్‌లో భార్యాభర్తలు శనివారం ఆత్మహత్యకు యత్నించారు. తమ భూమిని అమ్ముకోనీయకుండా ఆ ఫైనాన్స్ వ్యాపారి అడ్డుపడుతున్నట్టు వారు చెబుతున్నారు.

07/09/2016 - 17:12

నల్గొండ: భూ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని ఓ హోంగార్డు సెల్‌టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. మేళ్లచెరువులో శనివారం ఈ ఘటన జరిగింది. కోదాడ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మాన్‌సింగ్ భూ వివాదంలో తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాడు.

07/09/2016 - 17:09

హైదరాబాద్: రాబోయే ఆరునెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు కట్టబెడతారని, ఇందుకు అనుగుణంగా కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శనివారం మీడియాతో అన్నారు. త్వరలోనే కెటిఆర్ సిఎం కాబోతున్నట్టు తెరాస వర్గాల నుంచి తనకు నమ్మకమైన సమాచారం ఉందన్నారు. సిఎం పదవిలో ఎవరు ఉన్నా, 2019లో తెరాసకు గుణపాఠం ఖాయమన్నారు.

07/09/2016 - 16:22

హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవస్థలను తెరాస నిర్వీర్యం చేస్తోందని తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఆరోపించారు. టీడీఎల్పీలో గదుల తొలగింపుపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెదేపా తెలంగాణ ముఖ్య నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు.

07/09/2016 - 16:18

హైదరాబాద్‌: సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 13మంది రోగులకు చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిన ఘటనపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బృందం శనివారం విచారణ చేపట్టింది. గత నెల 30న 13మంది రోగులకు శస్త్ర చికిత్స చేసిన 4గురు వైద్యులను, వైద్య సిబ్బంది. నర్సులను కూడా విచారించారు. ఆపరేషన్‌ థియేటర్‌ను సందర్శించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

07/09/2016 - 15:25

హైదరాబాద్: రెండో విడత హరితహారం కార్యక్రమం సందర్భంగా ఈనెల 11న (సోమవారం) హైదరాబాద్ నగరంలో 25 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శనివారం విలేఖరులకు తెలిపారు. కొందరు విపక్ష నాయకులు హరితహారం కార్యక్రమంపైనా లేనిపోని విమర్శలు చేయడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

07/09/2016 - 15:24

హైదరాబాద్: తాను ఎసిబి డిఎస్పీనని బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్న ఓ నకిలీ డిఎస్పీని నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎసిబి డిఎస్పీగా పరిచయం చేసుకుని అరవింద్‌కుమార్ అనే డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ను బెదిరించి నాలుగు లక్షల రూపాయలు దండుకున్నాడు. అంతటితో ఆగక తనకు ఓ ఐఫోన్ కావాలంటూ ఒత్తిడి చేశాడు.

07/09/2016 - 15:23

ఖమ్మం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామస్వామి వారి ఆలయంలో మద్యం సేవించి విధులకు హాజరైన ముగ్గురు ఉద్యోగులను ఆలయ ఇఓ సస్పెండ్ చేశారు. మద్యం సేవించి వీరు విధులకు వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆలయ ఇఓ స్పందించారు. ఓ రికార్డు అసిస్టెంటు, అటెండర్, సేవకుడిపై సస్పెన్షన్ విధించారు. ఆలయ ఇఓ చర్యపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

07/09/2016 - 15:23

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ వద్ద హనుమాన్ నగర్‌లో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఓ మహిళ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. దానిపై స్పందించన పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారైన మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

07/09/2016 - 15:22

హైదరాబాద్: తెలంగాణలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎంసెట్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎంట్రన్స్ నిర్వహణకు తెలంగాణలో 95, ఎపిలో 28 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. తెలంగాణలో 38,245 మంది, ఎపిలో 17,943 మంది విద్యార్థులు ఎంసెట్-2కి దరఖాస్తు చేసుకున్నారు.

Pages