S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/11/2016 - 01:15

హైదరాబాద్, జూలై 10: రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెం దిన చిన్నారి రమ్య భౌతికకాయానికి ఆదివారం గోల్నాకలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈనెల ఒకటిన పంజగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమ్య తొమ్మిది రోజులపాటు కోమాలోకెళ్లి శనివారం రాత్రి మృతి చెందిన విషయం విదితమే. కాగా ఆదివారం ఉదయం రమ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

07/11/2016 - 01:11

హైదరాబాద్, జూలై 10: వరుస సెలవులు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా హరిత హారంలో పాల్గొనడంతో తెలంగాణ సచివాలయం బోసి పోయింది. రంజాన్‌కు రెండు రోజుల సెలవు ఇచ్చారు. ఆ వెంటనే రెండవ శనివారం, ఆదివారం రావడంతో వరుసగా ప్రభుత్వ కార్యాలయాలు పని చేయలేదు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అని ఒక రోజు ముందుగానే కొందరు వెళ్లిపోయారు. ఇక మంత్రులు రంజాన్ కన్నా ముందు నుంచే హరిత హారం ఏర్పాట్ల కోసం జిల్లాల్లో మకాం వేశారు.

07/11/2016 - 01:09

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిని నియమించారు. శేరి సుభాష్‌రెడ్డి నియామకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఖరారు చేశారు.

07/11/2016 - 01:07

హైదరాబాద్, జూలై 10: రెండు వారాల పాటు కొనసాగనున్న హరితహారం కార్యక్రమంలో కలెక్టర్లు క్రియాశీలకంగా పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రజా ప్రతినిధులు అందరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజా ఉద్యమంగా నడిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

07/11/2016 - 01:06

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు బాగానే ఉండటంతో సేద్యం జోరుగా సాగుతోంది. రాష్ట్రం మొత్తంలో 115 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం 50 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. విత్తనాలు వేయడం ఈ నెల చివరి వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో వరినారుమళ్లు కూడా ప్రారంభమయ్యాయి.

07/10/2016 - 08:16

మహబూబ్‌నగర్, జూలై 9: కొత్త జిల్లాల సాధనకై పోరు ఉద్ధృతం అవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా లో గద్వాల, నారాయణపేట జిల్లాల ఏర్పాటుకై డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

07/10/2016 - 08:14

వరంగల్, జూలై 9: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలని కొనసాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటుంది. ఉద్య మం ఒకవైపు ఊపందుకుంటున్నా పోలీసులు మరోవైపు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే దాదాపు 60కేసులు నమోదు చేసిన పోలీసులు 22మందిని రిమాండ్‌కు తరలించారు. జిల్లా సాధన ఐకాస చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి సహా కీలక నాయకులంతా ఇంకా జైల్లోనే ఉన్నారు.

07/10/2016 - 08:12

అదిలాబాద్, జూలై 9: ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వాకులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో తూర్పు ప్రాంతంలోని బెజ్జూరు, కోటపల్లి, దహెగాం, సిర్పూర్‌టి మండలాల్లోని సుమారు 70 గ్రామాలకు రవాణా సమాచారం తెగిపోయింది.

07/10/2016 - 08:09

నల్లగొండ, జూలై 9: కరవు.. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా మునుగోడు, దేవరకొండ, సాగర్ నియోజకవర్లాల రైతులకు మూడు లక్షల ఎకరాల మేరకు కృష్ణా సాగునీరు, 19 మండలాల పరిధిలోని 204 గ్రామాలకు రక్షిత మంచినీరు అం దించే లక్ష్యంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం ముంపు గ్రామాల ప్రజల పాలిట కన్నీటి కడలిగా మారిందని బాధితులు వాపోతున్నారు.

07/10/2016 - 08:07

అదిలాబాద్, జూలై 9: గిరిజన మైనర్ బాలికను భయపెట్టి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడమే కాక, సోషల్ మీడియా వీడియోలో అప్‌లోడ్ చేసిన సంఘటనపై జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఆలస్యంగానైనా స్పందించారు.

Pages