S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/11/2016 - 06:10

హైదరాబాద్, జూలై 10: ఇల్లలకగానే పండుగ కాదు. జిల్లాల విభజనకు పూనుకోగానే అయిపోయినట్టు కాదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రభుత్వోద్యోగుల బదిలీలు భారీఎత్తున చేయాల్సి వస్తుంది. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారబోతోంది.

07/11/2016 - 05:55

హైదరాబాద్, జూలై 10: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర బంగాళా ఖాతంలో ఒడిశా తీరంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

07/11/2016 - 04:50

మిర్యాలగూడ, జూలై 10: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు నీరు, 10 లక్షల డబుల్‌బెడ్‌రూంలు కట్టిస్తానని కెసిఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఆ హామీలను అమలుచేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

07/11/2016 - 04:49

ఆత్మకూర్(ఎం), జూలై 10: నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వాకంతో ఓ గర్భిణి రోడ్డు పక్కన చెట్లపొదల్లో ప్రసవించిన దుస్థితి చోటుచేసుకుంది. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల మయూరి (22) ప్రసవానికి తన పుట్టిల్లైన ఆత్మకూర్(ఎం)కు వచ్చింది.

07/11/2016 - 04:48

హైదరాబాద్, జూలై 10: మహానగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి సోమవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. దిల్‌కుశ గెస్ట్‌హౌజ్‌లో గవర్నర్ నరసింహన్, పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి ఒకే సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు.

07/11/2016 - 04:47

మానకొండూర్, జూలై 10: దైవదర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురై తల్లీ, కొడుకులు తిరిగిరాని అనంతలోకానికి వెళ్లారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని ఖాదర్‌గూడెం గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ఆర్టీసి బస్సు-కారు ఢీకొన్న సంఘటనలో కారు నడుపుతున్న కొడుకు పెండ్యాల సుధీర్ (32), తల్లీ పెండ్యాల జ్యోతి (52) మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

07/11/2016 - 04:47

సిద్దిపేట టౌన్, జూలై 10: మెదక్ జిల్లాలో చేపట్టనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 16 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ప్రజలు జీవనోపాధి హక్కు, జీవించే హక్కు కోల్పోనున్నారని, దీనికంతటికీ ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలే కారణమని పౌరహక్కుల సంఘం నేతలు విమర్శించారు.

07/11/2016 - 04:46

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలపై కొనసాగుతున్న వివాదాలు సమిసిపోకముందే తాజాగా జిల్లా కేంద్రాలపై రగడ రాజుకుంటోంది. ఒకవైపు కొత్త జిల్లాలకోసం కొనసాగుతున్న ఆందోళనలు పాలకపక్షానికి తలనొప్పిగా మారగా, తాజాగా జిల్లా కేంద్రాల ఏర్పాటు అంశం కూడా తెరపైకి రావడంతో ప్రభుత్వానికి మున్ముందు తలనొప్పిగా మారబోతున్నాయని సంబంధిత జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.

07/11/2016 - 01:30

కొత్తగూడెం, జూలై 10: మిషన్ భగీరధ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లానీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వాటర్‌గ్రిడ్ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

07/11/2016 - 01:19

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 10: మహబూబ్‌నగర్ జిల్లాలోని అత్యధిక ప్రాంతాలకు నీరు అందించే నారాయణ్‌పేట్- కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కలిసి ఉద్యమించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు నిర్ణయించారు. ఆదివారం నారాయణ్‌పేట్-కొడంగల్ జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

Pages