తెలంగాణ

పోటెత్తింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర బంగాళా ఖాతంలో ఒడిశా తీరంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ముసురేసి ఉంది. తెలంగాణలో మరిన్ని వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిం చింది. ఇదిలావుంటే, గోదావరి ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటం తో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి పుష్కరాల సమయంలో కాళేశ్వరం వద్ద నీళ్లు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. అదే కాళేశ్వరం వద్ద ఇప్పుడు గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో ఆలయానికి వచ్చిన భక్తులు నదీమతల్లిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద మూడు రోజలుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నగరం గ్రామంలో గోదావరి ఒడ్డున లంగరు వేసివున్న రెండు నాటు పడవలు, ఒక లాంచి వరద తాకిడికి కొట్టుకుపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లోని పెద్దంపేట, లెంకల గడ్డ, పంకెన, పలిమెల, సర్వాయిపేట, ముకునూరు వద్ద వాగులు ప్రవహిస్తున్నాయి. వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లడంతో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన చత్తీస్‌గఢ్, మహారాష్టల్ల్రోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో వరంగల్ ఏటూరు నాగారంలో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఏటూరునాగారం పుష్కర ఘాట్ వద్ద నీటి మట్టం 8.50 మీటర్లకు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి పుష్కర ఘాట్ వద్ద గట్టు కోతకు గురైంది. రాంనగర్ లో లేవల్ వంతెనపై ఉన్న జీడివాగు ఉప్పొంగింది. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో లోతట్టు ప్రాంతాలైన రాంనగర్, లంబాడీ తండా, కోయగూడ, ఎల్లాపూర్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలకు వరద నీరు వచ్చి చేరింది. ఎస్సారెస్పీకి ఎగువన ఉన్న ఉన్న ఆదిలాబాద్‌లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షాలు ఉండడంతో రైతులు ఖరీఫ్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరదతో ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద ఆదివారం నాటికి 12 మీటర్ల మేర వరద నీరు చేరుకుంది. కొంగాల వాగు పొంగుతోంది. రహదారి నీటిలో మునిగిపోవడంతో వాజేడు- గుమ్మడి దొడ్డిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతం పెరుగుతుండడంతో తాలిపేరు నుంచి ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద ఎక్కువ కావడంతో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి ఆరువేల క్యూసెక్లు నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.

చిత్రం... కాళేశ్వరం పుష్కరఘాట్‌వద్ద వరద గోదారమ్మకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు