తెలంగాణ

కొత్త జిల్లా కేంద్రాలపైనా రగడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలపై కొనసాగుతున్న వివాదాలు సమిసిపోకముందే తాజాగా జిల్లా కేంద్రాలపై రగడ రాజుకుంటోంది. ఒకవైపు కొత్త జిల్లాలకోసం కొనసాగుతున్న ఆందోళనలు పాలకపక్షానికి తలనొప్పిగా మారగా, తాజాగా జిల్లా కేంద్రాల ఏర్పాటు అంశం కూడా తెరపైకి రావడంతో ప్రభుత్వానికి మున్ముందు తలనొప్పిగా మారబోతున్నాయని సంబంధిత జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. కొత్త జిల్లాలకోసం జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉంటే తాము రాజకీయంగా దెబ్బతింటామని పాలకపక్షానికి చెందిన నేతలు, శ్రేణులు కూడా ఆందోళనకారులతో గళం కలిపి జాయింట్ యాక్షన్ కమిటీలో పాలుపంచుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కేంద్రాలు ఎక్కడ ఉండాలన్న దానిపై ఇప్పటికే కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలపై సెగ రాజుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కేంద్రంగా కొమురం భీమ్ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ జిల్లా కలెక్టర్ నుంచి కూడా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మంచిర్యాలను జిల్లా కేంద్రంగా ప్రతిపాదించింది. అయితే సింగరేణికి హెడ్ క్వార్టర్‌గా ఉన్న బెల్లంపల్లిలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తాజాగా ఆందోళన ప్రారంభమైంది. వరంగల్ జిల్లా భూపాలపల్లి కేంద్రంగా ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలోనూ టిఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ ప్రకటించారు. అయితే తాజాగా భూపాలపల్లి కాకుండా ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆందోళన రాజుకుంది. దండకారణ్యానికి ముఖ ద్వారంగా ఉండే ములుగు ఎప్పటినుంచో రెవిన్యూ, పోలీస్ డివిజన్ కేంద్రంగా కొనసాగుతోందని, సబ్ కలెక్టర్ హోదాలో ఇక్కడ ఎప్పటినుంచో ఐఎఎస్ అధికారిని నియమిస్తుండటం వల్ల ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జగిత్యాల జిల్లాకు రామగుండాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పుట్టుకొచ్చింది. రామగుండం ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిగా ఎదగడంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే వనపర్తి, నాగర్‌కర్నూల్ కేంద్రంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుకూలంగానే కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు అందాయి.
జిల్లాలో రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాలుగా ఉన్నప్పుడు ఎప్పటినుంచో రెవిన్యూ డివిజన్‌గా ఉన్న నారాయణపేటను జిల్లాగా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలో గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు ఉపందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నారాయణపేట కూడా తెరపైకి వచ్చింది. తమ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయబోయే వనపర్తి జిల్లాలో కలిపేటట్టయితే నారాయణపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త జిల్లాల డిమాండ్లతో జరుగుతున్న ఆందోళనలో ప్రజల పక్షాన నిలబడకపోతే రాజకీయంగా భవిష్యత్ ఉండదన్న భయంతో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా తమ వంతుగా ప్రభుత్వంపై వత్తిడి చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల నుంచి అందిన నివేదికల్లో ప్రతిపాదించిన జిల్లా కేంద్రాలపై దాదాపు సగం జిల్లాల్లో ఆందోళనలు ఇప్పటికే రాజుకున్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతాయని, రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతుందని, అలాగే రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయన్న అంచనాతో స్థానిక ప్రజాప్రతినిధులు పరోక్షంగా ఆందోళనకారులకు లోపాయికారిగా మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది. భవిష్యత్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఆ దమాషా ప్రకారం మంత్రుల సంఖ్య పెరుగుతుందని తద్వారా కొత్త జిల్లాల నుంచి మంత్రి పదవులు పొందవచ్చని రాజకీయ నేతలు అంచన వేస్తున్నారు.
కొత్త జిల్లాల డిమాండ్ల వెనుక పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల హస్తం ఉందన్న సమాచారం ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించడం లేదని, స్థానికంగా పార్టీ బలపడటానికి ప్రజల వ్యూహాత్మకంగా పట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కొత్త జిల్లాలు, కేంద్రాల డిమాండ్‌తో జరుగుతున్న ఆందోళనల్లో స్థానిక ప్రజల పక్షాన నిలబడకపోతే రాజకీయంగా ప్రతిపక్షాలు లబ్థిపొందకుండా ఉండేందుకే పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నట్టు ఇటీవల పార్టీ ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు.

వైభవంగా కూచిపూడి నృత్యాంశాలు

కూచిపూడి, జూలై 10: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నాట్యక్షేత్రం కూచిపూడి సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఆదివారం అన్నమాచార్య 608వ జయంతి నాట్యోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం, తెనాలి, తణుకు, విజయవాడ, తాడేపల్లిగూడెం, పార్వతీపురం, ఏలూరు, తదితర ప్రాంతాల నుండి 30 మంది నాట్యాచార్యులు, 300 మంది కళాకారులతో ప్రదర్శించిన అన్నమాచార్యుల సంకీర్తన కూచిపూడి నృత్యాంశాలు అలరించాయి. కొత్తగూడెంకు చెందిన సీతాలక్ష్మి ప్రసాద్ బృందం ప్రదర్శించిన ప్రత్యేక అంశం ప్రేక్షకులను తన్మయపర్చింది. చిన్నారుల నృత్యాలు పులకింపజేశాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకృష్ణాశ్రమం నిర్వాహకులు ముత్తీవి గౌరాకృష్ణ, పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు యాదవ్, రైల్వే బోర్డు సభ్యుడు చిరువోలు బుచ్చిరాజు పాల్గొన్నారు.