S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/09/2016 - 14:26

ఖమ్మం: ఆర్థిక సమస్యలు, మనస్పర్థల కారణంగా గొడవ పడిన దంపతులు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో శనివారం ఉదయం వెలుగు చూసింది. ఎప్పటిలగా తాటి లోకేష్, అతని భార్య అసోని శుక్రవారం రాత్రి డబ్బుల విషయమై గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన లోకేష్ సమీపంలోని ఓ బావిలో దూకాడు. ఈ విషయం తెలిశాక భార్య అసోని కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

07/09/2016 - 12:18

ఆదిలాబాద్‌: భారీ వర్షానికి మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి శనివారం ఆటంకమేర్పడింది. గనిలోకి వరదనీరు చేరడంతో మట్టి వెలికితీత, బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. 6వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులకు, 1500 టన్నుల బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకమేర్పడింది.

07/09/2016 - 12:08

హైదరాబాద్‌: పాతబస్తీ హసన్‌నగర్‌లో శనివారం ఉదయం 400 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 18మంది అనుమానితులు, 9మంది రౌడీషీటర్లు, పశ్చిమ్‌బంగాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 3 కార్లు, 4 వేట కొడవళ్లు, 280 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

07/09/2016 - 12:01

వరంగల్: నర్సంపేట ఎస్సీ సంక్షేమ హాస్టల్‌‌లో శనివారం తెల్లవారుజామున రైస్ బాయిలర్ లీకవ్వడంతో వంటమనిషి, ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్సకై సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

07/09/2016 - 07:41

నల్లగొండ, జూలై 8: హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అడుగడుగునా నిరసన సెగలు ఎదురయ్యాయి. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నూతన గోదాంలను ప్రారంభించి మొక్కను నాటి గుండ్రాంపల్లి హరితహారం కార్యక్రమానికి బయలుదేరారు. మార్కెట్ యార్డు నుండి బస్సు బయలుదేరగానే ఆకస్మాత్తుగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు బస్సుకు అడ్డం పడి ప్లకార్డులతో నినాదాలకు దిగారు.

07/09/2016 - 07:40

గచ్చిబౌలి, జూలై 8: రాబోయే ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐటి శాఖామాత్యులు కెటి రామారావు అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు.

07/09/2016 - 07:39

హైదరాబాద్, జూలై 8: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుని ఎస్సీ, ఎస్టీ, బిసిలకు హాస్టళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలను నిర్మించి నిధులు కేటాయించాలని టిడిపి ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం చైర్మన్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సచివాలయంలోని 9 భవనాల్లో 7 భవనాలను ఐదు నుంచి పది సంవత్సరాల్లోపు నిర్మించారన్నారవు.

07/09/2016 - 07:38

ఆసిఫాబాద్, జూలై 8: ఓ గిరిజన యువతిని భయపెట్టి అత్యాచారానికి పాల్పడడమేకాకుండా ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఉదంతం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతంలో కలకలం రేపుతోంది. వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి అన్నా.. నన్ను వదిలేయండంటూ ఆ యువతి ఏడుస్తూ బలవంత పెడుతున్న ఇద్దరు మృగాళ్లను ప్రాధేయపడుతున్నట్లు తెలుస్తోంది.

07/09/2016 - 07:38

వరంగల్, జూలై 8: హరితహారం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇనుప రాడ్‌తో ఏర్పాటు చేసిన హరితహారం జెండాలను శుక్రవారం జాతీయ రహదారి డివైడర్ మధ్యలో పాతుతుండగా విద్యుత్ వైరు తగలడంతో కార్పొరేషన్ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు.

07/09/2016 - 06:00

హైదరాబాద్, జూలై 8: ‘గాంధీ భవన్‌లో కూర్చుంటే పార్టీ అధికారంలోకి రాదు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాపోరాటాలు చేయండి’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ పార్టీ నేతలకు హితవు చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.

Pages