తెలంగాణ

చెట్లపొదే దిక్కయంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్(ఎం), జూలై 10: నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వాకంతో ఓ గర్భిణి రోడ్డు పక్కన చెట్లపొదల్లో ప్రసవించిన దుస్థితి చోటుచేసుకుంది. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల మయూరి (22) ప్రసవానికి తన పుట్టిల్లైన ఆత్మకూర్(ఎం)కు వచ్చింది. ఆమెకు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు నొప్పులు రావడంతో తల్లి ఎల్లమ్మ ఆమెను స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అయితే ఆసుపత్రిలో ఉన్న ఆయా రాచమల్ల లక్ష్మమ్మ ఎఎన్‌ఎంలు లేరంటూ మయూరిని ఆసుపత్రిలో చేర్చుకోనేందుకు నిరాకరించింది. దీంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు కూడా నిరాకరించి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. అక్కడి నుండి ఆటోలో భువనగిరి ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో మయూరికి నొప్పులు అధికంగా కాగా చేసేది లేక తల్లి ఎల్లమ్మ రోడ్డు పక్కన చెట్లపొదల్లో ఆటో ఆపించింది. మయూరి ఆ వెంటనే ఆడ శిశువుకు అక్కడే జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక గ్రామస్థులు అక్కడికి చేరుకుని తల్లీబిడ్డను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ సంఘటనపై ఆసుపత్రి ప్రధాన వైద్యుడు కృతారెడ్డిని నిలదీశారు. ఆయా తమకు సమాచారం ఇవ్వలేదని, ఎఎన్‌ఎంలు కూడా లేకపోవడం తప్పేనని, వారిపై చర్య తీసుకుంటానని వారికి సర్దిచెప్పారు. తల్లీబిడ్డలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అయతే, నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామస్థులు, మహిళలు, వార్డు సభ్యులు పిహెచ్‌సి ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్టక్రార్యదర్శి నల్ల చంద్రస్వామి, ఉప సర్పంచ్ యాస కవిత, వార్డు సభ్యులు నాతి స్వామి, పాశం అనంతరెడ్డి, మునగ జయశ్రీ, పంజాల పద్మ, నర్సమ్మ, గంగమ్మ, అంజమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

ఆడశిశువుకు జన్మనిచ్చిన మయూరి