తెలంగాణ

నేడు కోటి మొక్కల యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా కోటి మొక్కలు నాటుతారు. దీనికి సంబంధించి పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజక వర్గం దామరగిద్ద మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై పంచాయితీరాజ్ శాఖ జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘అంకెల గారడీ అవసరం లేదు, మంచి వర్షాలు కురుస్తున్నాయి, ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా హరిత హారం విజయవంతం చేయాల’ని మంత్రి అధికారులకు సూచించారు.
మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత మహిళా సంఘాలు తీసుకోవాలని సూచించారు. మొక్కలకు సంబంధించి పూర్తి సమాచారంతో రిజిస్ట్రర్ నిర్వహించాలని చెప్పారు. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఎనిమిది వేల గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతారు. నాలుగు లక్షల 14వేల 406 మహిళా సంఘాల్లోని 47లక్షల 20వేల 342 మంది సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. టేకు, ఈత చెట్లతో పాటు పండ్లను ఇచ్చే చెట్లు, నీడను ఇచ్చే మొక్కలను నాటుతారు. మహబూబ్‌నగర్‌లోలో 15లక్షలు, నల్లగొండ 12లక్షలు, ఖమ్మం పది లక్షలు,రంగారెడ్డి ఆరులక్షలు, మెదక్ పది లక్షలు, కరీంనగర్ 11లక్షలు, వరంగల్‌లో 16లక్షలు, ఆదిలాబాద్‌లో 10 లక్షలు, నిజామాబాద్‌లో పది లక్షలు మొత్తం కోటి మొక్కలు నాటుతారు.