తెలంగాణ

రూ. 32 లక్షల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, జూలై 11: ఎటిఎంలలో డబ్బులు పెట్టి మరో ఎటిఎంలో డబ్బులు సమకూర్చేందుకు వెళ్తున్న నల్లగొండ రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ సిబ్బందిని ఆగంతులు పథకం ప్రకారం అనుసరించి కంట్లో కారం చల్లి దాడి చేసి వారి వద్ద ఉన్న 32 లక్షల నగదును చోరీ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైటర్ సేఫ్ గార్డ్ సిబ్బంది చింతల శ్రీను, సుంకరబోయిన నాగారాజు సోమవారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తూ నల్లగొండ యాక్సిస్ బ్యాంకు నుండి 43 లక్షలు డ్రా చేసి నల్లగొండలోని ఐసిఐసిఐ ఎటిఎంలో 3 లక్షల 50 వేలు జమ చేశారు. అక్కడి నుండి బైక్‌పై బయలుదేరి మునుగోడులోని ఇండిగో ఎటిఎం రెండింటిలో కలిపి మరో 7 లక్షల 50 వేలు జమ చేశారు. అక్కడి నుండి కొంపల్లి మీదుగా చండూర్ మండలంలోని గట్టుప్పల్ ఇండిగో ఎటిఎంలో నగదు జమ చేసేందుకు బయలు దేరారు. దారి మధ్యలో కొంపల్లి-వెల్మికనే్న గ్రామాల మధ్య గుర్తు తెలియని ఇద్దరుఆగంతులు బైక్‌పై హెల్మెట్‌లు ధరించి వచ్చి కారంతో రైటర్స్ సిబ్బందిపై దాడి చేశారు. బైక్ నుండి రైటర్స్ సిబ్బంది కింద పడి కళ్ల నుండి కారం తొలగించుకుని చూసేలోగా వారి వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను తీసుకుని ఆగంతుకులు పారిపోయారు. అయితే ఈ వ్యవహారంలో రైటర్స్ సిబ్బంది తీరుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైటర్స్ సిబ్బంది ప్రత్యేక జీప్ తరహా వాహనంలో మాత్రమే ఎటిఎంల నగదును తరలిస్తుంటారని, కానీ అందుకు విరుద్ధంగా బైక్‌పై నగదుతో ప్రయాణించడం వెనుక మతలబు ఏమిటో తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. ఆగంతుకులు, రైటర్స్ సంస్థ సిబ్బంది కలిసి ఆడుతున్న నాటకమే కావచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఈ చోరీ సంఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా డిఎస్పీ సుధాకర్ తెలిపారు.