తెలంగాణ

ప్రాణం తీసిన కుందేళ్ల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, జూలై 11: పంటను అడవి పందుల బారి నుండి రక్షించుకునేందుకు ఓ రైతు పొలం దగ్గర పెట్టిన కరెంట్ షాక్‌కు కుందేళ్లు పట్టేందుకు వేటకు వెళ్లిన వేటగాడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శిరోనిబావితండాలో జరిగింది. వెల్దండ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెదురుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుగ్గకాలువ తండాకు చెందిన రాత్లావత్ గోపాల్, హరిలాల్ ఆదివారం రాత్రి శిరోనిబావితండా సమీపంలో గల వ్యవసాయ పొలాల్లో కుందేళ్లు పట్టేందుకు వేటను ప్రారంభించారు. ఈ తండాకు చెందిన శీన్యానాయక్ అనే రైతు తమ పొలంలోని పంటను అడవి పందుల భారీ నుండి రక్షించేందుకు కరెంట్ షాక్‌ను అమర్చాడు. ఇది గమనించకుండా రాత్లావత్ గోపాల్ (30) అనే వేటగాడు ఆ పొలంలో సంచరిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అతని వెనుక ఉన్న హరిలాల్ గోపాల్‌ను చూసేసరికి రాత్లావత్ గోపాల్ మృతి చెంది ఉన్నట్లు గుర్తించాడు. సంఘటన స్థలాన్ని కల్వకుర్తి సిఐ వెంకట్, వెల్దండ ఎస్సై జానకీరాంరెడ్డి, ప్రొబేషనరీ ఎస్సై కొండల్, ట్రాన్స్‌కో ఎఇ రమేష్‌గౌడ్, వైస్ ఎంపిపి వెంకటయ్యగౌడ్ చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోసుటమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య తస్లితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

చిత్రం.. కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన రాత్లావత్ గోపాల్