తెలంగాణ

పది లక్షల మొక్కలు నాటిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల విద్యార్ధులు పాల్గొని సోమవారం నాడు దాదాపు పది లక్షల మొక్కలు నాటారు. ప్రభుత్వం సైతం ఊహించని స్పందన విద్యాసంస్థల నుండి దక్కింది. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడం, ఒక పక్క మొక్కలు నాటుతుంటే మరో పక్క వర్షపు జల్లుతో విద్యార్ధుల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సిబ్బంది, విద్యార్ధులు కలిపి దాదాపు లక్ష మొక్కలను నాటారు. ఉస్మానియా యూనివర్శిటీ, ఇఫ్లూ , తెలుగు యూనివర్శిటీ, నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, గీతం యూనివర్శిటీ, ఇక్ఫాయి యూనివర్శిటీ, జెఎన్‌టియు హెచ్, జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ విద్యార్ధులు హరిత హారంలో చురుకుగా పాల్గొన్నారు. జెఎన్‌టియులో రెండో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాగి, మామిడి, సుబాబుల్, నీలగిరి, నేరేడు సహా పలు రకాల మొక్కలు దాదాపు 750 నాటారు. యూనివర్శిటీలోని స్పందన, సిఇసి, సిఆర్‌సి, సివిల్ తదితర ప్రాంతాల్లో నాటారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రెక్టార్, రిజిస్ట్రార్, బిక్స్ డైరెక్టర్, వివిధ విభాగాలకు చెందిన డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్‌లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాంట్ మి, ఈచ్ ఒన్ కార్యక్రమం పేరుతో ముందు ముందు విరివిరిగా కొనసాగిస్తామని, నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న కోఆర్డినేటర్లు సుమన్, లలిత, రాహుల్, కావ్య , సునీత, వర్ష తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా గీతం క్యాంపస్‌లో విద్యార్ధులు 10వేల మొక్కలు నాటారు. అమీన్‌పూర్‌లో మరో ఆరువేల మొక్కలను గీతం విద్యార్ధులు నాటారు. సిఐఐ సౌజన్యంతో ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయ కర్త డాక్టర్ పి వి నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గీతం టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ సంజయ్, రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్‌ఆర్ వర్మ, బార్క్ పూర్వ శాస్తవ్రేత్త డాక్టర్ జి ఎ రామారావు, సిఐఐ ప్రతినిధులు డిపీవీ సురేష్, ఎం నాగేశ్వరరావు పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ, సెల్ట్, లా కాలేజీ, యూనివర్శిటీ లైబ్రరీ, హెల్త్ సెంటర్, కోటి ఉమెన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున విద్యార్ధులు పాల్గొని మొక్కలు నాటారు. ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ విష్ణుదేవ్ ఆధ్వర్యంలో 20వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీన్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో లక్ష మొక్కలను విద్యార్ధులు నాటారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, విసి ప్రొఫెసర్ అప్పారావు పొదిలి , క్రెడాయ్ తెలంగాణ స్టేట్ చాప్టర్ అధ్యక్షుడు రాం రెడ్డి, జనరల్ సెక్రటరీ రామకృష్ణారావు, మురళీకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. 250 ఎకరాల్లో మొత్తం లక్ష మొక్కలను సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1300 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, జెఎన్‌టియుకు అనుబంధంగా ఉన్న 20 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే ప్రదేశంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం తెలంగాణలో ఇదేనని విసి అప్పారావు వ్యాఖ్యానించారు. ప్రగతి రిసార్ట్సులో జరిగిన హరితహారంలో పాల్గొన్న మాజీ ప్రధాన ఎన్నికల అధికారి జెఎం లింగ్డో మాట్లాడుతూ ఇదో తక్షణ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ప్రగతి హరిత హారంలో లక్ష పదిహేడు వేల మొక్కలను నాటారు. ఆస్కిలో జరిగిన ప్రత్యేక హరిత హారం కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ పారమిత దాస్ గుప్త, చైర్మన్ కె పద్మనాభయ్య పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆస్కి సిబ్బంది హరితహారంలో పాల్గొన్నారు.