తెలంగాణ

మొక్కలు నాటి సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 11: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, నాటిన మొక్కలను సంరక్షించాలని రాష్ట్ర గవర్నర్ ఇసిఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం పటన్‌చెరు నియోజకవర్గం బిహెచ్‌ఇఎల్ కంపెనీలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా స్వంత ఇంటి కార్యక్రమంగా భావించాలని కోరారు. నేడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయి పట్టణాలు, గ్రామాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోతున్న తరుణంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఇంకుడు గుంతలతోపాటు ఇంటికి పది మొక్కలకు తక్కువ కాకుండా నాటిన తరువాతే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని హార్టికల్చర్‌తో అనుసంధానం చేసి పండ్ల మొక్కలతో పాటు ఔషధ గుణాలు కలిగిన చెట్లు నాటి మరింత గొప్పగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత యేడాది జిల్లాలో చేపట్టిన హరితహారంలో 52శాతం మాత్రమే మొక్కలు రక్షించబడ్డాయని, ప్రస్తుత హరితహారంలో నాటిన మొక్కలపై ఆరు నెలల్లో సర్వేచేసి ఫొటోలు తీయించి పరిశీలిస్తామన్నారు. నాటిన మొక్కలను వంద శాతం కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యత తీసుకున్న సంస్థలకు అవార్డులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రికగా అభివర్ణించారు. మానవ ఇతిహాసంలో చైనా, ఆఫ్రికాలో జరిగిన కార్యక్రమం తరువాత రాష్ట్రంలో జరిగే మూడవ అతి పెద్ద ప్రయత్నమే హరితహారం అని పేర్కొన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మాట్లాడుతూ పుట్టుక నుండి చావు వరకు చెట్టుతోనే మనిషి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు. సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రం హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి పరిధిలో ఒకే రోజు 25లక్షల మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు హరిత తెలంగాణను అందించాలని సంకల్పించినట్లు తెలిపారు. అనంతరం గవర్నర్ భేరి నినాదంతో పాఠశాల విద్యార్థులు బిహెచ్‌ఇఎల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులతో హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం బిహెచ్‌ఇఎల్ పాఠశాలలో మొక్క నాటుతున్న గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్. రాష్ట్ర మంత్రి కెటిఆర్.