తెలంగాణ

దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 10: సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, టి. హరీష్ రావు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. దిగ్విజయ్ అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేశారని భట్టివిక్రమార్క ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. లోగడ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నీరుగార్చడమే అభివృద్ధి అవుతుందా? అన ఆయన ప్రశ్నించారు. రైతులకు మూడో విడత రుణ మాఫీ చేయలేదని, రుణ మాఫీలో అస్తవ్యస్తమైన విధానాన్ని అవలంభిస్తున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 6 లక్షల డబుల్ బెడ్ రూంలు నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణానికి 46 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. సుమారు 3 లక్షల దళిత కుటుంబాలు భూమి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు.
జానాను సమర్థించిన భట్టి
ఇలాఉండగా టి.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి వ్యాఖ్యలను భట్టి విక్రమార్క సమర్థించారు. హరిత హారం మంచి కార్యక్రమమని, ప్రజలంతా భాగస్వామ్యం కావాలని జానారెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జానారెడ్డి ఇచ్చిన పిలుపు గురించి ప్రశ్నించగా, హరిత హారం మంచి కార్యక్రమమని అన్నారే తప్ప అందులో అవినీతి జరగలేదని జానా అనలేదని ఆయన తెలిపారు. హరిత హారంలో వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని భట్టివిక్రమార్క విమర్శించారు. గాంధీ కుటుంబంతో పోల్చుకునే అర్హత టిఆర్‌ఎస్ నేతలకు లేదని అన్నారు.
ఆటు పోట్లు ఎదురైనా
వామపక్షాల సమైక్య పోరాటాలు
సిపిఐ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 10: ప్రజాసమస్యలపై కమ్యూనిస్టు పార్టీ ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిందని అయినప్పటికీ తగిన గుర్తింపు రావడం లేదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చీలికరావడంతో అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వామపక్ష, ప్రగతిశీల శక్తులతో కలసి పోరాడుతూ అంతిమంగా సోషలిజం స్థాపన కోసం కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరుగుతున్న రాజకీయ శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన ‘పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, కర్తవ్యం’ అన్న అంశంపై చాడ మాట్లాడారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పలుపునిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. సిపిఐ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ నిలబడిందని, లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ శిక్షణ శిబిరాలకు ప్రిన్సిపాల్‌గా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రవీంద్రచారి వ్యవహరించగా, నాయకులు ధర్మేంద్ర, నెర్లకంటి శ్రీకాంత్, బాలకిషన్, కమతం యాదగిరి, మల్లేష్, కిషన్, యాదిరెడ్డి, చక్రిత తదితరులు పాల్గొన్నారు.