తెలంగాణ

త్వరలో రైతు దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 10: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు, ఎమ్మెల్యే కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి త్వరలో రైతు దీక్ష చేపట్టబోతున్నారు. రైతులకు మూడో విడత రుణ మాఫీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. గాంధీ భవన్ గడప దాటండి..అని రెండు రోజుల క్రితం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పార్టీ నాయకులకు ‘షాక్’ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాంధీ భవన్ ప్రకాశం హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన పార్టీ శిక్షణా తరగతిలో దిగ్విజయ్ ప్రసంగిస్తూ గాంధీ భవన్‌లో కూర్చుంటే అధికారం రాదు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా పోరాటాలు చేయండి..అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకత్వం పోరాటాలకు దిగడం లేదన్న భావన, అసంతృప్తి సొంత పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో దిగ్విజయ్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, మెదక్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు బాగా కురిసి, రైతులు పంటలు వేసుకునేందుకు సమాయత్తమైనా, వారు విత్తనాలు, ఎరువులు ఖరీదు చేసుకోవడానికి వీలుగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రభుత్వం మూడో విడత రుణ మాఫీ చేయకపోవడమే. ప్రభుత్వం మూడో విడత రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవని రైతు సంఘాలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ‘రైతు దీక్ష’ చేపట్టాలని కెప్టెన్ ఉత్తమ్ నిర్ణయించారు. టి.పిసిసి అనుబంధ విభాగమైన కిసాన్, ఖేత్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి కెప్టెన్ ఉత్తమ్ వద్ద దీక్ష చేపట్టాలన్న ప్రతిపాదన పెట్టడంతో ఆయన వెంటనే అంగీకరించారని తెలిసింది. అయితే నిరవధిక దీక్ష చేపట్టాలా?, 48 గంటల దీక్ష చేపట్టాలా? ఒక్క రోజు దీక్ష చేయాలా? అనేది ఇంకా ఆయన తేల్చుకోలేదు. పైగా దీక్ష ఎక్కడ చేపట్టలి?, హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టాలని పార్టీ నాయకులు పలువురు సూచించగా, హైదరాబాద్‌లో రైతులు ఉండరని, మళ్లీ జిల్లాల నుంచి పిలిపించాల్సి వస్తుంది కాబట్టి, మెదక్ లేదా మహబూబ్‌నగర్ జిల్లాలో చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని మరి కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీక్ష ఈ నెలాఖరున చేపట్టే అవకాశం ఉంది. దీనిపై ఇంకా తర్జన-్భర్జన కొనసాగుతున్నది. సోమవారం కెప్టెన్ ఉత్తమ్ కిసాన్, ఖేత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.