తెలంగాణ

ఎస్పీపై దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డు సిబ్బందితో తన ఇంట్లో వంటపని, దొడ్డిచావిడి పనులు చేయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ ఇన్‌చార్జి డిజిపి అంజనీకుమార్ ఆదేశానుసారం హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన బృందం కేసు దర్యాప్తు జరుపుతోంది. కాగా అధికార సమాచారాన్ని లీక్ చేశారంటూ బంట్వారం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మహేశ్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు.
హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్‌ను విధుల నుండి తప్పించి విచారణ చేపట్టాలని హోంగార్డుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.శుభప్రద్‌పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లా హోంగార్డులతో కలసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ హోంగార్డుల చేత నీచాతినీచమైన పనులు చేయించడం బాధాకరమన్నారు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పని చేయించుకుని ఇక్కట్లపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఇన్‌చార్జి డిజిపి విచారణకు డిఐజి అకున్‌సబర్వాల్‌ను ఆదేశించారని, విచారణ పేరుతో జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు నలుగురు హోంగార్డులను శనివారం రాత్రి నిర్బంధించి తప్పుడు సాక్ష్యంతో ఎస్‌బిఐ సంతకాలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంఘటన విషయమై హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్ళామని, అమెరికా నుండి రాగానే హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళతామని వివరించారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటిలో అరవింద్ అనే వ్యక్తి చెప్పినట్టు వినాలని లేకపోతే బెదిరింపులకు పాల్పడే వారని అన్నారు. ఎస్పీ నవీన్‌కుమార్, ఎస్‌బిఐ వేణుగోపాలరాజులు ఎలాంటి సంబంధం లేని ఎఎస్పీ వెంకటస్వామిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విచారణ పేర హోంగార్డులను బంధించి బెదిరించి తప్పుడు సంతకాలతో సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసి న్యాయం చేయాలని, లేనిపక్షంలో దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. జిల్లాలోని 285 మంది హోంగార్డులలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా బాధ్యత ఎస్పీ నవీన్‌కుమార్, ఎస్‌బిఐ వేణుగోపాలరాజుదేనని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా హోంగార్డుల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, ప్రధానకార్యదర్శి శ్రీశైలం, నాయకులు ఆంజనేయులు, రజియొద్దీన్, బందయ్య పాల్గొన్నారు.