తెలంగాణ

నేటితో ముగియనున్న ఉగ్రవాదుల కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఐఎస్‌ఎస్ ఉగ్రవాదుల 12 రోజుల కస్టడీ మంగళవారంతో ముగియనుంది. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది సానుభూతిపరులను గత నెల 28న ఎన్‌ఐఏ, నగర పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరుగురిని విచారించి వదిలేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో ఐదుగురిని తమ కస్టడీకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ జరిపారు. ఉగ్రవాదుల్లో కీలక వ్యక్తి ఇబ్రహీం యజ్దాని మహరాష్ట్ర నాందేడ్‌లో ఆయుధాల కొనుగోలు, అనంతపురం బస్టాండ్‌లో సమీపంలోని ఓ లాడ్జిలో బస చేసి మారణాయుధాలు కొనడం, తలాబ్‌కట్టలోని ఓ మీసేవా కేంద్రం నుంచి ఐసిస్ చీఫ్‌తో సంభాషించడాన్ని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో కీలక ఉగ్రవాది ఫహద్ రసాయన పదార్థాలు సేకరణ, బేగంబజార్‌లో వెయింగ్ మిషన్, సంతోష్‌నగర్‌లో నిజాముద్దీన్ అనే సానుభూతిపరుడి అడ్రస్‌తో సిమ్‌కార్డుల కొనుగోలు, చార్మినార్ వద్ద ఐదు చైనా ఫోన్లు, 9సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్థారించారు. మంగళవారం చివరి రోజు జరిపే విచారణలో ఇంకా ఏమైనా కీలక సమాచారం రావచ్చని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.