తెలంగాణ

కంటి ఆపరేషన్ల కేసు 28కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11 : హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి (ఎస్‌డిఇ) దవాఖానాలోని ఒక ఆపరేషన్ థియేటర్‌లో జూన్ 30 న జరిగిన కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటనపై లోకాయుక్త తన విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. లోకాయుక్త జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సంస్థ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్స్ విచారణ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ తమ నివేదికను సోమవారం లోకాయుక్తకు అందించారు. అలాగే డైరెక్టర్ వైద్య విద్య (డిఎంఇ) డాక్టర్ ఎం. రమణి సోమవారం లోకాయుక్తకు ఒక నివేదిక అందచేస్తూ, ప్రభుత్వ పరంగా ముగ్గురు నిపుణులతో ఒక కమిటీ వేశామని తెలిపారు. ఈ కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందగానే, దాని కాపీని తమకు అందించాల్సిందిగా లోకాయుక్త డిఎంఇని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణ కోసం జూలై 28కి వాయిదా వేస్తున్నట్టు లోకాయుక్త సోమవారం జరిగిన విచారణ తర్వాత ప్రకటించారు. ఇలా ఉండగా సరోజిని కంటి ఆసుపత్రిలో ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో ప్రస్తుతం నలుగురే ఆసుపత్రిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు తాము వెళ్లిపోతామని ఆసుపత్రి వర్గాలకు విన్నవించారు. ఇంకా వీరిని డిశ్చార్జి చేయలేదు.