తెలంగాణ

కొత్త బస్సులొస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ త్వరలో కొత్త బస్సులు కొనుగోలు చేయనుంది. రూ.350 కోట్లతో 1200 బస్సులు కొనుగోలు చేస్తారు. వీటిలో 150 ఏసి బస్సులతోపాటు మినీ బస్సులు ఉంటాయని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసీ రూ.700 కోట్లతో నడుస్తుందని, నష్టాల నుంచి అధిగమించేందుకు ఇటీవల బస్సు చార్జీలను పెంచడం జరిగిందన్నారు. పెంచిన బస్సు చార్జీలతో రూ.284 కోట్లు నష్టాన్ని పూడ్చుకోగలుగుతున్నామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా పదివేల బస్సులు కలిగి రోజుకు 90 లక్షల ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసి బలోపేతానికి కృషి జరుపుతున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించిన 12 సూత్రాల ఫార్ములాను అమలు చేసేందుకు ఆర్టీసి సిద్ధంగా ఉందన్నారు. పర్యాటక క్షేత్రాలకు మినీ బస్సులు, హైదరాబాద్‌లో కొత్త బస్టాప్‌ల ఏర్పాటుతోపాటు బస్సులు, బస్టాప్‌లలో ప్రకటనలతో ఆదాయం పెంచుకోవడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ప్రైవేటు బస్సుల నియంత్రణ, కార్గొ, కొరియర్ ట్రాన్స్‌పోర్ట్‌ల ఏర్పాటు, బస్టాండ్‌లలో మినీ థియేటర్ల ఏర్పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్‌లలో నాన్‌వెజ్ క్యాంటీన్‌ల ఏర్పాటుతో ఆర్టీసికి ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రమణరావు పేర్కొన్నారు.