S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/13/2016 - 16:26

న్యూదిల్లి: జెఎన్‌యు నేత కన్నయ్యకుమార్‌ను హతమారుస్తామని బెదరించిన కేసులో ఉత్తరప్రదేశ్ నవనిర్మాణసేనకు చెందిన అమిత్‌జానీని అరెస్టు చేశారు. దిల్లీలోని జెఎన్‌యులో ఓ బస్సులో దొరికిన ఆయుధాలు, కరపత్రాల ఆధారంగా జానీని అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ హత్యకు కూడా అతడు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.

05/13/2016 - 16:24

న్యూదిల్లి:సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తనకు మరో ఇందిరాగాంధీలా కన్పిస్తారని, ఆమె భవిష్యత్‌లో రాజకీయంగా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్ అన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెజారిటీ ఉన్నప్పటికీ తన ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి రాష్టప్రతి పాలన విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనకు నిరాశ కలిగించిందని అన్నారు.

05/13/2016 - 16:23

న్యూదిల్లి:నేటితో పదవీ విరమణ చేస్తున్న 53మంది రాజ్యసభ సభ్యులకు మోదీసహా పలువురు సభ్యులు వీడ్కోలు పలికారు. పదవిలో లేకపోయినా ప్రజాసేవలో తలమునకలవ్వాలని, అధికారికంగా సభ్యులు కాకపోయినా ఎంపీల హక్కులు పరిరక్షిస్తామని, అందువల్ల ప్రజాసేవలో కొనసాగాలని ప్రధాని మోదీ వారిని కోరారు. లోక్‌సభ సభ్యులకు లేని అవకాశం రాజ్యసభ సభ్యులకు ఉందని, మనలో మనం వీడ్కోలు చెప్పుకునే అవకాశం ఇక్కడ ఉందని అన్నారు.

05/13/2016 - 12:23

కోజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్ రామ్‌గోపాల్ మీనా (45) పై ఉమేష్‌పాల్ యాదవ్ అనే హెడ్ కానిస్టేబుల్ గురువారం రాత్రి కాల్పులు జరిపాడు. శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకుపోవడంతో మీనా అక్కడికక్కడే మరణించారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

05/13/2016 - 12:21

దిల్లీ: పదవీ విరమణ చేస్తున్న 53 మంది ఎంపీలకు ఈరోజు రాజ్యసభలో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే ఇదే అంశాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సభ ఎజెండాలో లేదు. ఈరోజు రైటైరవుతున్న 53 మంది ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన వారు 16 మంది ఉన్నారు.

05/13/2016 - 12:19

దిల్లీ: గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ఇక్కడ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన నేరుగా సుప్రీం జడ్జిగా నియమితులై అరుదైన అవకాశం పొందారు.

05/13/2016 - 04:11

న్యూఢిల్లీ, మే 12: కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అగస్టా వెస్ట్‌లాండ్ కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కీలక శక్తిగా తాను అభివర్ణించిన మాట నిజమేనని ఈ వివాదాస్పద ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ అంగీకరించారు.

05/13/2016 - 03:54

న్యూఢిల్లీ, మే 12: దేశంలో నెలకొన్న కరవుపరిస్థితులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని కేం ద్రం గురువారం తెలియజేసింది. ‘కోర్టు తీర్పును అధ్యయనం చేస్తు న్నాం. సుప్రీంర్టు ఆదేశాలను అమలు చేయడానికి మేము తక్షణ చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కె పట్నాయక్ చెప్పారు.

05/13/2016 - 03:52

న్యూఢిల్లీ, మే 12: ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త అంటువ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు వైద్య సేవలపై మరింత ఒత్తిడి పెంచుతున్న దృష్ట్యా నర్సింగ్ రంగంలో సామర్థ్యం పెంపునకు కొత్త కొత్త మార్గాలను అనే్వషించాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

05/13/2016 - 03:49

న్యూఢిల్లీ, మే 12: మొదట్నుంచీ సోనియాపైనే ఆమె అత్త ఇందిర మక్కువ చూపేవారా? ఒక దశలో చిన్న కోడలు మేనకను చేరదీసినప్పటికీ ఆమెను అనివార్యంగా ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ కేపీ మాథుర్ తన తాజా పుస్తకం ‘అన్‌సీన్ ఇందిరాగాంధీ’లో మాజీ ప్రధాని గురించి అనేక వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Pages