జాతీయ వార్తలు

కరవుపై ‘సుప్రీం’ తీర్పును త్వరలోనే అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: దేశంలో నెలకొన్న కరవుపరిస్థితులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని కేం ద్రం గురువారం తెలియజేసింది. ‘కోర్టు తీర్పును అధ్యయనం చేస్తు న్నాం. సుప్రీంర్టు ఆదేశాలను అమలు చేయడానికి మేము తక్షణ చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కె పట్నాయక్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా బిహార్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కరవు పరిస్థితిని సమీక్షించడానికి వారం రోజుల్లోగా ఈ మూడు రాష్ట్రాల అధికారులతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. కరవు పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడు నెలల్లో జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ నిధిని ఏర్పాటు చేయాలని ‘స్వరాజ్ అభియాన్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై బుధవారం ప్రకటించిన తీర్పులోసుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారం రోజుల్లో బిహార్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కరవు పరిస్థితిని సమీక్షించాలని, ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా కరవు నిర్వహణ మాన్యువల్‌ను సవరించాలని, నీటి సంరక్షణ కోసం, కరవును ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని కూడా కోర్టు ఆదేశించింది.
రుతుపవనాల వైఫల్యం కారణంగా దేశం వరసగా రెండో ఏడాది కరవు పరిస్ధితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్నాటక సహా పది రాష్ట్రాలు 2015-16 పంటల సంవత్సరాన్ని కరవు సంవత్సరంగా ప్రకటించాయి.
మంచినీరు, పశువుల దాణా కొరతను, ఇతర సమస్యలను తీర్చడానికి కేంద్రం ఈ రాష్ట్రాలకు ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయల సాయాన్ని విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరవు పరిస్థితిని సమీక్షించడానికి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమైనారు. మిగతా రాష్ట్రాల సిఎంలతో కూడా ఆయన రాబోయే రోజుల్లో సమావేశం కానున్నారు.

చిత్రం మహారాష్టల్రోని కరద్ సమీపంలో ఎండిన నదీ ప్రాంతంలో కొంగల సందడి