S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/13/2016 - 03:45

న్యూఢిల్లీ, మే 12: బడ్జెట్ మలివిడత లోక్‌సభ సమావేశాలు ఒక్క వాయిదా కూడా లేకుండా నూటికి, నూట ఇరవైశాతం సజావుగా సాగా యి.. నమ్మశక్యంగా లేదా.. అక్షరాలా నిజం.. లోక్‌సభ తాజా సమావేశాల్లో ఒక్క వాయిదా కూడా లేదు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత మొట్ట మొదటి సారి ఏప్రిల్ 25న ప్రారంభమైన 16వ లోక్‌సభ 8వ సెషన్ 92గంటల 21 నిమిషాల పాటు 13 సిట్టింగులు ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగింది.

05/13/2016 - 03:36

న్యూఢిల్లీ, మే 12: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను దేశంనుంచి పంపించి వేయడానికి బ్రిటన్ నిరాకరించిన తర్వాత మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు సహకరించేలా చేయడం కోసం ఆయనపై ఇంటర్‌పోల్ అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. అంతర్జాతీయ పోలీసు సంస్థ అయిన ఇంటర్‌పోల్‌నుంచి రెడ్‌కార్నర్ నోటీసు సంపాదించాలని ఇడి సిబిఐకి ఒక లేఖ రాసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

05/13/2016 - 03:35

గయ (బిహార్), మే 12: ఆదిత్య సచ్‌దేవ అనే విద్యార్థిని తన కుమారుడు కాల్చి చంపిన కేసులో పరారీలో ఉన్న ఎమ్మెల్సీ మనోరమ దేవికోసం పోలీసులు గయ, నవాడా, పాట్నాల్లో గాలించారు. మరోవైపు, మనోరమ కుమారుడు రాకీ యాదవ్ చేతిలో దారుణ హత్యకు గురయిన సచ్‌దేవ రక్తపు మరకలతో కూడిన దుస్తులను పోలీసులు గురువారం ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.

05/13/2016 - 03:35

న్యూఢిల్లీ, మే 12: వెనుకబడిన తరగతుల వారి సమస్యలు పరిష్కరించాలని బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కర్నాటక సిఎం సిద్దరామయ్యను గురువారం ఇక్కడ కలిశారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా బిసిల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు.

05/13/2016 - 03:34

కోల్‌కతా, మే 12: పశ్చిమబెంగాల్ అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన దాని ప్రభావం కేరళ ఎన్నికలలో ఉంటుందని భావించరాదని సీపీఎం స్పష్టం చేసింది. కేరళలో ఎన్నికలు, రాజకీయ సమీకరణాల పరిస్థితులు వేరని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఏ బేబీ గురువారం అన్నారు. కేరళలో అధికార కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌కి, లెఫ్ట్ ఫ్రంట్‌కి మధ్య ముఖాముఖి పోరాటం జరుగుతుందని బేబీ అన్నారు.

05/13/2016 - 03:33

న్యూఢిల్లీ, మే 12: కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ రాష్టప్రాల్ (76) ఆకస్మికంగా మృతిచెందడంతో గురువారం నిరవధికంగా వాయిదా పడవలసిన రాజ్యసభ ఆయనకు సంతాపం తెలిపిన అనంతరం రేపటి వరకు వాయిదా పడింది. సీనియర్ కాంగ్రెస్ నేత, గుజరాత్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న రాష్టప్రాల్ గురువారం ఉదయం గుండెపోటుతో ఢిల్లీలోని తన నివాసంలో మృతిచెందారు.

05/13/2016 - 03:33

కౌలాలంపూర్, మే 12: ఇప్పటివరకూ ఆచూకీ లేకుండా పో యిన మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం ఎంహెచ్ 370కి చెందినవిగా భావిస్తున్న మరో రెండు శకలాలు లభ్యమయ్యాయని మలేసియా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దక్షిణాఫ్రికా, మారిషస్‌లో రెండు విమాన శకలాలు లభ్యమయ్యాయనీ, ఈ రెండూ ఆచూకీ లేకుండా పోయిన విమానానివేనని భావిస్తున్నట్లు పేర్కొంది.

05/13/2016 - 03:32

న్యూఢిల్లీ, మే 12: దేశ రాజధాని ఢిల్లీ పౌరులకు సంతోషం కలిగించే వార్త! గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా అపఖ్యాతి మూటగట్టుకున్న ఢిల్లీకి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూటిఓ) తాజాగా వెల్లడించిన జాబితాలో ఢిల్లీ 11వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ 103 దేశాల్లోని మూడు వేల నగరాల్లో అధ్యయనం చేసి తన తాజా నివేదికను వెల్లడించింది.

05/13/2016 - 03:31

ఉజ్జయిని, మే 12: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన అఖారాల్లో వివిధ పదవుల కోసం జరిగిన ఎన్నికల సందర్భంగా సాధువులు త్రిశూలాలతో ఒకరిపై మరొరు దాడి చేసువడంతో ఆరుగురు సాధువులు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు సాధువులను పోలీసులు అరెస్టు చేశారు.

05/13/2016 - 03:17

న్యూఢిల్లీ, మే 12: ప్రధాని నరేంద్ర మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సమావేశం అయ్యారు. గురువారం పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను ఆయనకు వివరించారు. అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తోనూ నరసింహన్ సమావేశమయ్యారు.

Pages