S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/15/2016 - 02:35

ఉజ్జయిని, మే 14: భూతాపం, ఉగ్రవాదం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నీకన్నా నేనే ఎక్కువ గొప్పవాడిని’ అనే అహంకార వైఖరే వీటివెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న సింహస్థ కుంభమేళా సందర్భంగా శనివారం ‘లివింగ్ ది రైట్ వే’ అనే అంశంపై ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.

05/15/2016 - 02:42

చెన్నై/తిరువనంతపురం, మే 14: ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. దీంతో అయిదు రాష్ట్రాల్లో దాదాపు రెండు నెలలపాటు సాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడినట్లయింది. కేరళలో అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది.

05/15/2016 - 02:25

న్యూఢిల్లీ, మే 14: బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఇద్దరు జర్నలిస్టుల హత్యలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, వారిపై జరిగే దాడుల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

05/15/2016 - 02:23

న్యూఢిల్లీ, మే14: ‘నేను జాతిపిత మహాత్మా గాంధీ మనుమడిని, తల దాచుకునేందుకు ఒక ఇంటికోసం వెతుకుతున్నాను, సహాయంకోసం ప్రభుత్వాన్ని లేదా ఇతరులను చేయిచాచి అడగలేను, బిచ్చమెత్తలేను’ అని మహాత్మా గాంధీ మనుమడు కనుభాయి రాందాస్ గాంధీ (87) చెబుతున్నారు.

05/15/2016 - 02:19

ఐక్యరాజ్య సమితి, మే 14: అణు నిరాయుధీకరణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పోస్టర్ పోటీలో విజేతలయిన ముగ్గురిలో 22 ఏళ్ల భారతీయ చిత్రకారిణి అంజలీ చంద్రశేఖర్ ఉన్నారు. శాంతి కపోతం ఒకటి అణ్వాయుధాన్ని చీల్చుకుని ఎగురుతున్నట్లుగా ఉన్న అంజలి వేసిన చిత్రానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ ప్రశంసలు కూడా లభించాయి.

05/15/2016 - 02:19

కోల్‌కతా, మే 14: జాదవ్ పూర్ యూనివర్సిటీ విద్యార్థినులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జాదవ్‌పూర్ విద్యార్థినులు స్థాయికి తగినట్లుగా ఉండరు. వారికి బిడియం లేదు. ఎప్పుడూ మగ విద్యార్థులతో కలిసి తిరిగే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు’’ అంటూ అవాకులు పేలారు.

05/14/2016 - 12:26

పాట్నా: తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని తానే రివాల్వర్‌తో కాల్చి చంపినట్లు నిందితుడు రాకీ యాదవ్ అంగీకరించినట్టు బిహార్ పోలీసులు చెబుతున్నారు. జెడియు ఎమ్మెల్సీ మనోరమ కుమారుడైన రాకీని కొద్ది రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను తాను హత్యచేయలేదని తొలుత చెప్పిన రాకీ ఇపుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసుల సమాచారం.

05/14/2016 - 12:26

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుండగా ఎన్నికల అధికారులు శనివారం దాడులు నిర్వహించి 765 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లలో తరలిస్తుండగా ఈ నగదును పట్టుకున్నారు. అయితే, ఇది ఎస్‌బిఐకి చెందిన డబ్బు అని పట్టుపడిన వారు చెబుతున్నారు. తిర్పూరు వద్ద 3 కంటైనర్లలో 570 కోట్లు, కోయంబత్తూరు వద్ద 2 కంటైనర్లలో 195 కోట్లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.

05/14/2016 - 12:24

దిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగుస్తుంది. చివరిరోజు కావడంతో ఈ మూడు రాష్ట్రాల్లో ప్రచారం వేడెక్కింది. 16న జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలను పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు.

05/14/2016 - 07:44

న్యూఢిల్లీ, మే 13: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఏ) కింద రాష్ట్రాలకు బకా యి ఉన్న నిధులను, అవసరమైన ని ధులను తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఏంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, కరవు పీడిత రాష్ట్రాల్లో రైతులు జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. నిధులు లేవన్న కారణం చూపించి ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పించుకోజాలదని కోర్టు స్పష్టం చేసింది.

Pages