జాతీయ వార్తలు

‘ఉపాధి’ నిధులు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఏ) కింద రాష్ట్రాలకు బకా యి ఉన్న నిధులను, అవసరమైన ని ధులను తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఏంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, కరవు పీడిత రాష్ట్రాల్లో రైతులు జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. నిధులు లేవన్న కారణం చూపించి ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పించుకోజాలదని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో ముఖ్యంగా కరవు పీడిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టంలోని నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయడానికి, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కమిషనర్లను నియమించాలని జస్టిస్ ఎంబి లోకుర్, జస్టిస్ ఎన్‌వి రమణలతో కూడిన ధర్మాసనం రాష్ట్రాలను ఆదేశించింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా కేంద్ర ఉపాధి హామీ మండలిని ఏర్పాటు చేసి కరవు పీడిత ప్రాంతాల్లో పంట నష్టానికి పరిహారం చెల్లించబడేలా చూడాలని కూడా బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్లమెంటు చేసిన చట్టాన్ని తాము పాటించబోమని రాష్ట్రాలు చెప్పడానికి వీల్లేదని, ఈ దేశ చట్టాలకు రాష్ట్రాలతో సహా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది. కరవు పీడిత ప్రాంతాల్లో వేసవి కాలమంతా మధ్యాహ్న భోజన పథకం కొనసాగాలని బెంచ్ స్పష్టం చేసింది. తాము పిటిషన్‌పై విచారణను పూర్తి చేయలేదని, ఆగస్టు 1న తిరిగి ఈ అంశాన్ని విచారిస్తామని చెప్పిన సుప్రీంకోర్టు తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి కమిషనర్లను నియమించేందుకు నిరాకరించింది. కరవుకు సంబంధించిన వివిధ అంశాలపై సుప్రీంకోర్టు ఈ రోజు మూడు వినాగాల తీర్పును ప్రకటించింది. కాగా, తొలి తీర్పును న్యాయస్థానం ఈ నెల 11న ప్రకటించిన విషయం తెలిసిందే. కరవు లాంటి ప్రకృతి విపత్తుల విషయంలో రాష్ట్రాలు ఉష్టప్రక్షుల్లాంటి వైఖరిని కొనసాగించినట్లయితే కేంద్ర ప్రభు త్వం అది రాష్ట్రాల బాధ్యత అంటూ తన రాజ్యాంగపరమైన బాధ్యతలనుంచి తప్పించుకోజాలదని ఈ నెల 11న ప్రకటించిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గనుక స్పందించని పక్షంలో న్యాయ వ్యవస్థ తగిన ఆదేవాలు జారీ చేసే విషయాన్ని తప్పక పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, అయితే పాలనా వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉండాలని కూడా బెంచ్ ఆ తీర్పులో స్పష్టం చేసింది.