S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/17/2016 - 07:54

న్యూఢిల్లీ, మే 16: పరిపాలనకు సంబంధించి కార్యనిర్వహక వర్గం తీసుకునే నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని అన్ని అంగాలు దేనికది స్వయం నియంత్రణ పాటించాలని జైట్లీ స్పష్టం చేశారు.

05/17/2016 - 06:29

న్యూఢిల్లీ, మే 16: నీట్ నిర్వహణకు మెజారిటీ రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహ కొన్ని రాష్ట్రాలు మాత్రం నీట్‌కు ఆమోదం తెలియజేస్తూనే తమకు ఒకటి,రెండు సంవత్సరాల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె.డి.నడ్డా వెల్లడించారు.

05/17/2016 - 06:35

న్యూఢిల్లీ, మే 16: జాతీయస్థాయిలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. ఆ తరువాత వరుస ఎన్నికల్లో ఓటమిపాలై తలబొప్పి కట్టిన టీం మోదీకి అస్సాం రూపంలో ఊరట లభించనుంది. అయిదు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ తన మిత్రపక్షాలతో అధికారం చేపడుతుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్తున్నాయి.

05/16/2016 - 18:04

గాంధీనగర్: అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించేందుకు సోమవారం ఉదయం తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న జామ్‌నగర్ బిజెపి ఎంపీ పూనమ్ బెన్ ఆకస్మికంగా డ్రైనేజీలో పడిపోయారు. ఆమెను ముంబయిలోని ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెకు బలమైన గాయాలేవీ తగల్లేదని, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

05/16/2016 - 18:01

చెన్నై: మధురై, దుండిగల్, తిరుచ్చి, శివగంగతో పాటు పలు జిల్లాల్లో వర్షం కారణంగా పోలింగ్‌ను సోమవారం రాత్రి ఏడుగంటల వరకూ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వర్షం కారణంగా పోలింగ్‌కు ఆటంకాలు ఎదురవుతున్నందున సమయాన్ని పెంచాలని పలు రాజకీయ పార్టీలు ఇసికి విన్నవించాయి. దీంతో రాత్రి ఏడు గంటల వరకూ ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి తమళనాడులో 58.

05/16/2016 - 18:00

దిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేత, మనీల్యాండరింగ్ కేసుల్లో నిందితుడైన కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం మీడియాకు తెలిపారు. లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను బహిష్కరించాలంటూ తాము కోరినప్పటికీ బ్రిటన్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

05/16/2016 - 18:00

దిల్లీ: వైరల్ జ్వరంతో గత కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రాహుల్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి మోదీ కలత చెందారని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి నడ్డా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పదిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సలహా ఇవ్వడంతో రాహుల్ గాంధీ తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

05/16/2016 - 17:59

చెన్నై: ప్రస్తుత తమిళనాడు ఎన్నికల్లో అన్నాడిఎంకె ఆధిక్యత సాంపాదించి జయలలిత మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, 2019లో ఎపిలో నారా లోకేష్ సిఎం పదవి చేపడతారని తిరుపతికి చెందిన రాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.

05/16/2016 - 16:20

ముంబయి: తనకు భద్రత, స్వేచ్ఛకు సంబంధించి భరోసా ఇస్తే భారత్‌కు తిరిగి వచ్చేస్తానని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అంటున్నారు. యునైటెట్ బ్రెవరీర్ లిమిటెడ్ (యుబిఎల్) చైర్మన్ హోదాలో ఆయన లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో తన కంపెనీ డైరెక్టర్లతో మాట్లాడారు. బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సిన ఆయన భారత్ వస్తే తన భద్రత, స్వేచ్ఛ ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారట.

05/16/2016 - 16:19

దిల్లీ: మెడికల్ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు కావాలని పలు రాష్ట్రాలు కోరాయని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డా సోమవారం తెలిపారు. నీట్‌పై ఇక్కడి ఎయిమ్స్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు.

Pages