S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/16/2016 - 07:14

న్యూఢిల్లీ, మే 15: ఈ ఏడాది ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షలో టాప్ ర్యాంక్ పొందిన టిరా దబీకి 52 శాతం మార్కులే రావడాన్ని బట్టి దేశంలోని బ్యూరోక్రాట్లను ఎంపిక చేయడానికి యుపిఎస్‌ఇ ఎంతటి కఠినమైన ప్రమాణాలను పాటిస్తోందో అర్థమవుతుంది.

05/16/2016 - 07:13

న్యూఢిల్లీ, మే 15: దౌత్య కార్యకలాపాలతో నిత్యం రద్దీగా ఉండే సర్దార్ పటేల్ మార్గ్‌లోని 23 ఎకరాల స్థలంలో నివాస సముదాయం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై రాష్టప్రతి కార్యాలయం లేదా భద్రతా సంస్థలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటో వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశించింది.

05/16/2016 - 07:13

న్యూఢిల్లీ, మే 15: కనీసం 300 రూపాయల విలువ కలిగిన ప్రీ పెయిడ్ ఆర్డర్లపై 50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందించే ఒక కొత్త పథకాన్ని భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ప్రారంభించింది. ఈ నెల 13నుంచి ఈ పథకం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని ఐఆర్‌సిటిసి సిఎండి ఎకె మనోచా చెప్పారు.

05/16/2016 - 07:12

న్యూఢిల్లీ, మే 15: మాలెగావ్ పేలుళ్ల కేసులో జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన తాజా అఫిడవిట్ ఉగ్రవాదంపై పోరుకు భారత్ కృతనిశ్చయాన్ని ప్రశ్నార్థకంగా మార్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం వ్యాఖ్యానించింది. కాగా, ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేసింది.

05/16/2016 - 01:33

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన తల్లి హీరాబెన్
మొట్టమొదటిసారి రేస్‌కోర్స్ రోడ్‌లోని తనయుని అధికార నివాసానికి వచ్చారు. కొడుకుగా మోదీ ఆమెకు అన్ని సపర్యలు చేశారు. చక్రాల కుర్చీలో తల్లిని
కూర్చోబెట్టుకుని తన నివాస ప్రాంగణంలోని తోటలో సరదాగా తిప్పుతూ..

05/15/2016 - 16:41

శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా రసాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దట్టమైన అడవుల్లో అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ దావానలం సంఘటన మరవకముందే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

05/15/2016 - 16:39

న్యూదిల్లి: దేశంలోకి రుతుపవనాల రాక వారం ఆలస్యం కాబోతోందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దేశంలోని కేరళ తీరాన్ని జూన్ 1న తాకాల్సిన రుతుపవనాలు 7వ తేదీని పలకరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

05/15/2016 - 16:39

న్యూదిల్లి:ఈశాన్య రాష్ట్రంలోని ఓ పదాతిదళంలో సైనికులు తిరుగుబాటు చేశారన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. రోజువారీ శిక్షణలో పాల్గొన్న ఓ సైనికుడు గుండెపోటుతో మరణించడంతో తోటి సైనికులు భావోద్వేగానికి గురై ఆందోళనకు దిగారని, ఈ సందర్భంగా సైనికాధికారులతో వారు ఘర్షణపడ్డారని పేర్కొంది. అది తిరుగుబాటు కాదని తెలిపింది.

05/15/2016 - 04:08

భద్రాచలం, మే 14: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్రమత్తమై రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. బస్తర్ జిల్లా కోడెనార్ పోలీసుస్టేషన్ పరిధిలోని కుమార్‌సాంద్రా రైల్వేస్టేషన్‌కు తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు స్టేషన్‌పై దాడి చేశారు.

05/15/2016 - 03:14

కోయంబత్తూరు, మే 14: ఎన్నికల వేళ తమిళనాడులో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనం సృష్టించింది. శనివారం తిరుపూర్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు మూడు కంటైనర్లలో తరలిస్తున్న రూ.570 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Pages