S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/17/2016 - 09:03

న్యూఢిల్లీ, మే 16: ఝలోక్‌సభ ఎన్నికల అనంతరం వరుస పరాజయాలను చవి చూస్తున్న కాంగ్రెస్‌కు తాజా అయిదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత సంకటంగా మారాయి. తాము అధికారంలో ఉన్న అస్సాంను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి కాంగ్రెస్ చేరుకుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా స్పష్టంగా వెల్లడించాయి. అదేవిధంగా కేరళలో కూడా ఎల్‌డీ ఎఫ్‌దే అధికారమన్న ఈ ఫలితాలు పార్టీ అధినాయకత్వాన్ని అయోమయంలో పడేశాయి.

05/17/2016 - 08:11

జామ్‌నగర్ (గుజరాత్), మే 16: ‘మంచికి పోతే చెడు ఎదురుకావడం’ అంటే ఇదేనేమో. తన నియోజకవర్గంలోని ఒక మురికివాడలో ఇళ్లను కూల్చివేస్తున్నారని తెలుసుకుని, హడావిడిగా ఆ ప్రాంతానికి వెళ్లి, అకస్మాత్తుగా పది అడుగుల లోతైన డ్రైనేజీలో పడి ఒక మహిళా ఎంపీ తీవ్ర గాయాల పాలయ్యారు. జామ్‌నగర్‌లోని జాలారామ్ మురికివాడలో ఈ సంఘటన జరిగింది.

05/17/2016 - 08:09

న్యూఢిల్లీ, మే 16: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో సోమవారం ఎన్నికలు ముగియడంతో మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటమే తరువాయిగా మిగిలింది. 19న ఈ 3 రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, అసోంలో ఫలితాలు కూడా తేలనున్నాయ.

05/17/2016 - 08:06

న్యూఢిల్లీ, మే 16: భారత్‌ను 2019 అక్టోబర్ నాటికి పూర్తి పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంలో సుమారు 58 లక్షల మంది పింఛనుదారులను భాగస్వాములను చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

05/17/2016 - 08:05

న్యూఢిల్లీ, మే 16: చాలాకాలంగా ఎదురు చూస్తున్న నూతన విద్యావిధానాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం తన రెండేళ్ల కార్యకాలం (మే26) పూర్తి కావటానికి ముందే ప్రకటించబోతోంది. ‘జాతీయ విద్యావిధానం మే 26కు ముందు దేశం ముందుకు రాబోతోంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం తెలిపారు. ‘దేశ విద్యావిధానం ఎదుర్కొంటున్న సవాళ్లకు నూతన విద్యావిధానం కింద ఎన్‌సీఈఆర్‌టీ పరిష్కారం చూపుతుంది.

05/17/2016 - 08:03

న్యూఢిల్లీ, మే 16: దేశంలో గోవులను, గోశాలలను సంరక్షించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

05/17/2016 - 08:02

గాంధీనగర్, మే 16: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌కు స్థానభ్రంశం తప్పదా? బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రానికి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవటానికి ముఖ్యమంత్రి మార్పు తప్పదన్న నిర్ణయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

05/17/2016 - 07:59

పాట్నా, మే 16: బిహార్‌లో పాత్రికేయుడు రాజ్‌డియో రంజన్ హత్యపై దర్యాప్తు జరుగుతోందని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. హతుడి కుటుంబ సభ్యులకు బిహార్ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని చెబితే సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తామని సోమవారం ఇక్కడ ప్రకటించారు. జర్నలిస్టు హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నితీశ్ జర్నలిస్టు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

05/17/2016 - 07:57

న్యూఢిల్లీ, మే 16: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటనల నిమిత్తం రోజుకు 16 రూపాయలు ఖర్చుచేస్తోంది. ప్రభుత్వ నిధుల పొదుపుపై నిత్యం ఉపన్యాసాలు ఇచ్చే కేజ్రీవాల్ లక్షలాది రూపాయలు ఖర్చుచేయడం దుబారా కాదా అన్ని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆప్ ప్రభుత్వం అడ్వర్‌టైజ్‌మెంట్లపై ఆర్‌టిఐను ఆశ్రయించగా ఈ వివరాలు తెలిశాయి.

05/17/2016 - 07:56

న్యూఢిల్లీ, మే 16: కేంద్ర ప్రభుత్వం కారుణ్య మరణాల బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా ప్రజలను కోరింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం ఔషధాలు, చికిత్స ఆధారంగా ప్రాణాలతో ఉంటూ అవస్థపడుతున్న రోగులు నొప్పి తెలియకుండా మరణించడానికి వీలవుతుంది.

Pages