S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/16/2016 - 16:17

గయ: నడిరోడ్డుపై ఓ యువకుడిని కాల్చి చంపిన ఉదంతంలో ప్రధాన నిందితుడైన రాకీయాదవ్ స్నేహితుడు టెనీ యాదవ్ సోమవారం గయ కోర్టులో లొంగిపోయాడు. ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని తుపాకీతో రాకీ కాల్చినపుడు అతని పక్కనే టెనీ యాదవ్ కూడా ఉన్నాడు. సంఘటన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. ఇదివరకే పోలీసులకు లొంగిపోయిన రాకీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

05/16/2016 - 15:48

దిల్లీ: ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా కంపెనీ సౌత్‌ ఏషియా డివిజన్‌ సీఓఓగా పనిచేస్తున్న వినీత్‌ వైగ్‌(47) గుడ్‌గావ్‌లో నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ భవనం 19వ అంతస్థు నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వినీత్‌ సుసైడ్‌ లేఖలో పేర్కొన్నారు. వినీత్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

05/16/2016 - 13:53

దిల్లీ: మెడికల్ అడ్మిషన్లకు జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్) తప్పనిసరి అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం ఇక్కడ కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి జెపి నడ్డా అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఇక్కడి ఎయిమ్స్‌లో జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖామంత్రులు హాజరయ్యారు.

05/16/2016 - 11:48

చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల సమయానికే పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. చెన్నైలో ముఖ్యమంత్రి జయలిలిత, డిఎంకె అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్, డిఎండికె అధ్యక్షుడు, నటుడు విజయ్‌కాంత్, ఆయన భార్య ప్రేమలత, సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ తదితర ప్రముఖులు ఓటు వేశారు.

05/16/2016 - 07:22

మహాత్మాగాంధీ మనుమడు కానూభాయ్ రాందాస్ గాంధీ న్యూఢిల్లీలోని వృద్ధాశ్రమంలో ఉన్నారన్న వార్తా కథనాలపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేంద్రమంత్రి మహేశ్ శర్మను కానూభాయ్ దగ్గరకు పంపించి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న మోదీ... ఫోన్‌లో ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడి, తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

05/16/2016 - 07:20

దాహోద్ (గుజరాత్), మే 15: యుపిఏ ప్రభుత్వ పదేళ్ల పాలన తరువాత ఖాళీ ఖజానా వారసత్వంగా ఎన్‌డిఏ సర్కారుకు అందిందని, దీంతో తమ ప్రభుత్వానికి పేదలను ఆదుకోవడానికి సంబంధించిన పనులు చేయడం సాధ్యం కావడం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’ రెండో దశను ఆదివారం ఇక్కడ ఆయన ప్రారంభించారు.

05/16/2016 - 07:18

చెన్నై/తిరువనంతపురం, మే 15: తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటుగా పుదుచ్చేరి అసెంబ్లీలకు సోమవారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుత ముఖ్యమంత్రులు జయలలిత, ఊమన్ చాందీలతోపాటుగా వారి ప్రధాన ప్రత్యర్థులు, రాజకీయ కురువృద్ధులు కరుణానిధి, విఎస్ అచ్యుతానందన్‌ల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

05/16/2016 - 07:15

న్యూఢిల్లీ, మే 15: దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్న భారత రైల్వే వాటితో పాటు కొత్తగా ప్రవేశపెట్టే కొన్ని సాధారణ రైళ్లను పరీక్షించేందుకు రాయ్‌పూర్ వద్ద అత్యాధునిక లేబొరేటరీతో 20 కిలోమీటర్ల పొడవైన టెస్టు ట్రాక్‌ను ఏర్పాటు చేస్తోంది. కొత్త లోకోమోటివ్‌లు (ఇంజన్లు), కోచ్‌లతో పాటు హై యాక్సిల్ లోడ్ వ్యాగన్లను పరీక్షించేందుకు ఈ టెస్టు ట్రాక్‌ను ఉపయోగిస్తారు.

05/16/2016 - 07:50

శ్రీనగర్, మే 15: జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు మరో విజయం సాధించాయి. రెండు నెలలపాటు నిఘా వేసి పాకిస్తాన్ నుంచి కాశ్మీర్‌లోకి చొరబడిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. అయితే కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం పట్టుబడిన అబ్దుల్ రెహమాన్ అనే ఈ ఉగ్రవాది వద్ద ఆధార్ కార్డు ఉండటం భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేస్తోంది.

05/16/2016 - 07:14

న్యూఢిల్లీ, మే 15: గంగానది వెంట ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను వాటినుంచి ఏమాత్రం కాలుష్య జలాలు వెలువడకుండా (జీరో లిక్విడ్ డిశ్చార్జ్-జెడ్‌ఎల్‌డి) ఉండేలా మార్చేందుకు విధించిన గడువు ఆచరణ సాధ్యంకాని రీతిలో ఉందని పార్లమెంటరీ స్థారుూ సంఘం పేర్కొంది. రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా వాటి లక్ష్యాలను పునఃపరిశీలించాలని, 2017 మార్చి నాటికి ఆ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించింది.

Pages