S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/14/2016 - 07:41

న్యూఢిల్లీ, మే 13: పార్లమెంటు హక్కులను, అధికారాలను న్యాయ వ్యవస్థ ఆక్రమిస్తోందంటూ శుక్రవారం రాజ్యసభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

05/14/2016 - 07:37

న్యూఢిల్లీ, మే 13: వచ్చే నెల రాజ్యసభలోని 57 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల తర్వాత ప్రస్తుతం ప్రభుత్వానికి సంఖ్యాబలం లేని పెద్దల సభలో పరిస్థితి కొంత అనుకూలంగా మారనుంది. అయితే కీలకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)బిల్లును ఆమోదింప జేసుకునేందుకు ఇది ఎంతమాత్రం సరిపోదు.

05/14/2016 - 07:33

న్యూఢిల్లీ, మే 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ ప్రధానమంత్రి మటెయో రెంజితో జరిపిన ప్రైవేటు సంభాషణను ఇటలీ బహిర్గతం చేసే అవకాశం ఉందని అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ తెలిపారు.

05/14/2016 - 05:48

న్యూఢిల్లీ,మే 13: రాజ్యసభ నుండి రిటైర్ అవుతున్న 53మంది సభ్యులకు రాజ్యసభ శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ,ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు వివిధ పార్టీల నాయకులు రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు ఇస్తూ అభినందనలు తెలిపారు. సభ నుండి రిటైర్ అయినంత మాత్రాన ప్రజాసేవ నుండి రిటైర్ కాకూడదని వారు సూచించారు.

05/14/2016 - 05:43

న్యూఢిల్లీ, మే 13: రాజ్యసభ బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజైన శుక్రవారం నాడు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ కోసం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కె.వి.పి రామచందర్‌రావు, జె.డి.శీలం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజ్యసభ ఎజెండాలో హోదా బిల్లును చేర్చనందున ఓటింగ్ జరపటం సాధ్యం కాదని చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేశారు.

05/14/2016 - 05:42

న్యూఢిల్లీ,మే 13: పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నాలుగో సారి కూడా కర్నాటక నుండి రాజ్యసభకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆయన అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్యనాయుడిని నాలుగో సారి కర్నాటక నుండి రాజ్యసభకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన పట్ల రాష్ట్ర బిజెపిలో మొదట కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.

05/14/2016 - 05:15

ముంబయి, మే 13: మాలెగావ్ పేలుళ్లకేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) క్లీన్‌చిట్ ఇచ్చింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం(మోకా) కింద ఆమెపై విచారణ జరుగుతోంది.

05/14/2016 - 05:09

న్యూఢిల్లీ, మే 13: కాంగ్రెస్ పార్టీని మరో పెనుకుంభకోణం చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిఐపిల కోసం ఉద్దేశించిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ముడుపుల వ్యవహారంలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీకి అంతకు మించిన స్థాయిలోనే ఇంకో స్కామ్ ఇరుకున పడేసే సూచనలున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో సాగిన యూపీఏ హయాంలోనే నౌకాదళానికి సంబంధించి ఈ కుంభకోణం జరిగినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.

05/13/2016 - 16:44

హైదరాబాద్:ప్రపంచంలో అతిపెద్ద కార్గొ విమానం అనతోవ్, ఎఎన్-225 మ్రియ శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానం మనదేశానికి రావడం ఇదే ప్రధమం. 8 టర్బో ఫ్యాన్లతో పనిచేసే ఇంజన్ల సామర్థ్యం ఉన్న ఈ కార్గొ విమానం సుమారు 640 టన్నుల సరకును తరలించగలదు.

05/13/2016 - 16:44

న్యూదిల్లి:మహారాష్టల్రోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో సాధ్వి ప్రగ్యాసింగ్‌సహా ఎనిమిదిమంది కీలక నిందితులుకాగా వీరంతా త్వరలో ఆ కేసునుండి బయటపడనున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) వారిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్ (మొక) చట్టంకింద నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవడంతో వీరికి త్వరలో విముక్తి లభించనుంది.

Pages