జాతీయ వార్తలు

కర్నాటక నుండే వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 13: పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నాలుగో సారి కూడా కర్నాటక నుండి రాజ్యసభకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆయన అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్యనాయుడిని నాలుగో సారి కర్నాటక నుండి రాజ్యసభకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన పట్ల రాష్ట్ర బిజెపిలో మొదట కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యెడ్యూరప్ప కూడా వెంకయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచటంతో రాష్ట్ర బిజెపి నాయకులు దారికి రాక తప్పలేదని అంటున్నారు. జాతీయ రాజకీయాలు ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో వెంకయ్య ప్రాధాన్యత, అవసరం ఎంతో ఉండటంతో ఆయనను నాలుగోసారి కూడా రాజ్యసభకు ఎంపిక చేయాలని బిజెపి అధినాయకత్వం నిర్ణయించిందని అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ నియమాల ప్రకారం సీనియర్ నాయకులను మూడుసార్లు మాత్రమే రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
కాగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ నుండే రాజ్యసభకు ఎన్నిక అవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నెలకొన్న కరవు గురించి చర్చించటంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి చర్చించేందుకు ఢిల్లీకి వచ్చినప్పుడు రాజ్యసభ సీట్ల గురించి ప్రధానితో చర్చించే అవకాశాలున్నాయి. నిర్మలా సీతారామన్‌ను రెండోసారి రాజ్యసభకు ఎంపిక చేయాలని మోదీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయవచ్చునని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.