జాతీయ వార్తలు

చర్చకు రాని ‘ప్రత్యేక హోదా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: రాజ్యసభ బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజైన శుక్రవారం నాడు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ కోసం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కె.వి.పి రామచందర్‌రావు, జె.డి.శీలం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజ్యసభ ఎజెండాలో హోదా బిల్లును చేర్చనందున ఓటింగ్ జరపటం సాధ్యం కాదని చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కెవిపి ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై పదిహేను రోజుల క్రితం చర్చ జరిపిన అనంతరం, ఓటింగ్ జరిపే సమయంలో సభలో కోరం లేకపోవటంతో వాయిదా పడటం తెలిసిందే. రాజ్యసభ కార్యక్రమాల్లో మొదట హోదా బిల్లుపై ఓటింగ్ జరిపించే అంశాన్ని చేర్చినా నిన్న జరిగిన బిఏసి సమావేశంలో కేవలం రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలు అంశాన్ని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. దీంతో రాజ్యసభ ఈరోజు ఎజెండా నుండి ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్ అంశాన్ని తొలగించి కేవలం రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలు అంశం చేపట్టారు.
శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే మొదటగా ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరపాలని శీలం డిమాండ్ చేశారు. ఆ వెంటనే రామచందర్‌రావు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి హమీద్ అన్సారీ బదులిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మొదటి శుక్రవారం రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు అంశాన్ని చేపడతామని ప్రకటించి, రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు.