జాతీయ వార్తలు

బిజెపికి పెద్దల సభ అనుకూలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: వచ్చే నెల రాజ్యసభలోని 57 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల తర్వాత ప్రస్తుతం ప్రభుత్వానికి సంఖ్యాబలం లేని పెద్దల సభలో పరిస్థితి కొంత అనుకూలంగా మారనుంది. అయితే కీలకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)బిల్లును ఆమోదింప జేసుకునేందుకు ఇది ఎంతమాత్రం సరిపోదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు రాజ్యసభలో సంఖ్యాపరమైన మార్పులు వచ్చినప్పటికీ సభలో కాంగ్రెసే అతి పెద్ద పార్టీగా ఉండబోతోంది.
245 మంది సభ్యులుండే ప్రస్తుత రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలుండగా, బిజెపికి 49 ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన చెరి 14 మంది సభ్యులు రిటైరవుతుండగా, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలలో బిజెపి సంఖ్యాబలం పెరిగిన కారణంగా వచ్చే నెల జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ 17-18 స్థానాలను గెలుచుకోవచ్చు. మరోవైపు ఈ రాష్ట్రాల్లోఓటమి కారణంగా కాంగ్రెస్ పార్టీ 8-9 స్థానాలను మించి గెలుచుకునే అవకాశాలు లేవు.ప్రభుత్వం ఇటీవల ఆరుగురు సభ్యులను నామినేట్ చేయడం బిజెపికి కొత్త బలాన్నిచ్చింది. మరో వైపు నాలుగు ఖాళీలున్న ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉండగా, తమిళనాడులో ఎన్నికలు జరి గే ఆరు స్థానాల్లో అత్యధిక స్థానాలను ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే అన్నాడిఎంకె దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న 11 స్థానాల్లో మెజారిటీ స్థానాలను అధికార సమాజ్‌వాది పార్టీ దక్కించుకోనుండగా, బిజెపి ఒకస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. మిగతా స్థానాలు బిఎస్‌పికి దక్కవచ్చు. ప్రస్తుతం వీటిలో బిఎస్‌పికి ఆరు, ఎస్‌పికి మూడు స్థానాలున్నాయి.
రాజ్యసభలో మారనున్న సమీకరణాలు ప్రభుత్వానికి మరింత అనుకూలం కాన్నాయని, బిజెపి బలం పెరగడం ఒక్కటే దీనికి కారణం కాదని, జిఎస్‌టి బిల్లులాంటి ప్రభుత్వ అజెండాకు సమాజ్‌వాది పార్టీ, తెరాస లాంటి ప్రాంతీయ పార్టీలు సర్దుబాటు ధోరణిలో ఉండడం కూడా మరో కారణమని బిజెపి నాయకుడొకరు చెప్పడం గమనార్హం.
కాగా, బిహార్‌లో ఖాలీ అవుతున్న అయిదు స్థానాలు జెడి (యు)కు చెందినవే కాగా, ఇప్పుడు ఆ పార్టీ 2 స్థానాలకు మించి గెలుచుకునే స్థితిలో లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన జెడి(యు) మిత్రపక్షమైన ఆర్‌జెడి మరో రెండు సీట్లు, బిజెపి ఒక స్థానాన్ని దక్కించుకోనున్నాయి.
మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఖాళీ చేసిన స్థానంతో సహా 57 రాజ్యసభ సస్థానాలకు వచ్చే నెల 11న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.