S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/12/2016 - 08:37

న్యూఢిల్లీ, మే 11: తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, పసుపు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యురాలు కవిత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కోరారు. రాధామోహన్ సింగ్ స్పందిస్తూ మద్దతు ధర అధ్యయనానికి త్వరలోనే అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని హామీ ఇచ్చారు.

05/12/2016 - 08:09

పణజీ, మే 11: అత్యాధునిక సూపర్‌సోనిక్ మిగ్29కే యుద్ధ విమానం భారతీయ నౌకాదళంలో బుధవారం ప్రవేశించింది. ఇదే సమయంలో 33 ఏళ్లుగా నౌకాదళంలో సేవలందించిన సీహారియర్స్‌ను నావీ తన దళం నుంచి ఉపసంహరించుకుంది.

05/12/2016 - 08:06

న్యూఢిల్లీ, మే 11: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల క్రితం మీడియాకు చూపించిన నరేంద్ర మోదీ డిగ్రీ ఒరిజినల్‌దేనని, తాము దాన్ని వెరిఫై చేశామని ఢిల్లీ యూనివర్శిటీ ప్రకటించినప్పటికీ ఈ వివాదాన్ని రేపిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆ వాదనతో ఏకీభవించడం లేదు.

05/12/2016 - 08:05

న్యూఢిల్లీ, మే 11: ఉత్తరాఖండ్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, తాను చేసిన తప్పులు ఆయన గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నామని రని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.

05/12/2016 - 08:04

న్యూఢిల్లీ, మే 11: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో భారత్‌కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్‌సహా అనేక కేసులు ఎదుర్కొంటున్న మాల్యాను స్వదేశానికి రప్పించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలాలేవు. విజయ్ మాల్యాను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది.

05/12/2016 - 08:04

న్యూఢిల్లీ, మే 11: బలపరీక్షలో విజ యం సాధించి ఉత్తరాఖండ్‌లో మళ్లీ కాంగ్రెస్ గద్దె నెక్కడంతో, రాష్టప్రతి పాలన నిర్ణయం వెనుక ప్రణబ్ ముఖర్జీ పాత్రపై పెద్ద దుమారమే లేస్తోంది. కేంద్రం అనుచిత సిఫార్సులను రాష్టప్రతి గుడ్డిగా సమర్థించారనడానికి ఉత్తరాఖండ్ పరిణామాలు ఉదాహరణ అంటూ కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై బహిరంగంగా గొంతు విప్పేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు.

05/12/2016 - 08:48

న్యూఢిల్లీ, మే 11: తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని విమర్శించటంతోపాటు పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించటంపట్ల పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

05/12/2016 - 08:02

లక్నో, మే 11: జితేంద్ర మిశ్రా.. అటవీ శాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. గత ఆదివారం ఆయన ఇంట్లో పాములున్నట్లు శబ్దం రావడంతో గాలించడం మొదలుపెట్టారు. ఇంకేముంది... అనుకున్నట్లుగానే రెండు పాములు ఆయన రూములోనే ఒకదానికొకటి పెనవేసుకుని బుసలు కొడుతూ కనిపించాయి. వెంటనే ఇరుగు పొరుగు వారిని పోగేసి వారి సహాయంతో వాటిని పట్టుకున్నారు. ఈ సంగతి ఇంతటితో ఆగిపోలేదు. ఇలా రోజూ రెండు మూడు పాములు వస్తూనే ఉన్నాయి.

05/12/2016 - 08:01

చెన్నై, మే 11: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత ఎం కరుణానిధి తన రాజకీయ వారసుడిగా చిన్నకుమారుడు స్టాలిన్‌ను ప్రకటించా రు. 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె అధికారంలోకి వచ్చి తానే ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించిన కరుణానిధి ‘ఒకవేళ తనకు అనుకోనిది ఏదైనా జరిగితే’ ఆ స్థానం స్టాలిన్ భర్తీ చేస్తాడనని కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

05/12/2016 - 05:48

న్యూఢిల్లీ/ హైదరాబాద్, మే 11: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద చేపట్టబోయే 11 తెలంగాణ ప్రాజెక్టులకు రూ.6700 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సాగునీటి పారుదల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పిఎంకెఎస్‌వై సబ్ కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది.

Pages