S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/11/2016 - 06:11

న్యూఢిల్లీ, మే 10: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ల తదుపరి విచారణ జూలై 11వ తేదీకి వాయిదా పడింది. మంగళవారం నూతన రాజధాని నిర్మాణంపై దాఖలైన పిటిషన్లు జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ శ్రీమన్నారాయణ తరపు న్యాయవాది సంజయ్ పారిక్ వాదనలు వినిపించారు.

05/11/2016 - 05:59

హైదరాబాద్, మే 10: సివిల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంటర్వ్యూ దశ వరకూ 95 మంది రాగా ఇంత వరకూ అందిన సమాచారం ప్రకారం 20 మంది ఎంపికయ్యారు. గ్రూప్ ఎ గ్రూప్ బి సర్వీసులను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య 50 వరకూ ఉండవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో సివిల్స్‌లో విశాఖపట్నానికి చెందిన సిహెచ్.కీర్తి అగ్రస్థానంలో నిలిచారు.

05/11/2016 - 05:59

విజయవాడ, మే 10: ఎప్పటికైనా ఐఎఎస్ అధికారి కావాలనే పట్టుదలతో మూడేళ్లుగా సివిల్స్ పరీక్ష రాస్తూ వచ్చిన విజయవాడ ముత్యాలంపాడు నివాసి చిట్టూరి రామకృష్ణ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 84వ ర్యాంక్ సాధించారు. 2013లో జరిగిన పరీక్షలో ఐపిఎస్‌కు, 2014లో జరిగిన పరీక్షలో ఐఆర్‌ఎస్‌కు అర్హత సాధించగా ఈ దఫా ఐఎఎస్‌కు ఎంపికై తన కోరిక నెరవేర్చుకున్నారు.

05/11/2016 - 05:55

విశాఖపట్నం, మే 10: యుపిఎస్‌సి పరీక్షల్లో 14వ ర్యాంకు సాధించిన తెలుగుతేజం సిహెచ్.కీర్తి ప్రజలకు చేరువగా సేవలందించాలన్న లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగంలో చేరిన కీర్తి రెండో ప్రయత్నంలో తన చిరకాల వాంఛ తీర్చుకుంది. ‘ఐఎఎస్‌గా బాధ్యతలు కత్తిమీద సాము. రాజకీయ జోక్యంతో పాటు ఒత్తిడి అధికం.

05/11/2016 - 06:06

న్యూఢిల్లీ, మే 10: సివిల్ సర్వీసెస్-2015 పరీక్షలో ఢిల్లీకి చెందిన టీనా దబి అనే యువతి టాప్ ర్యాంకును కైవసం చేసుకుని చాటుకుంది. మంగళవారం ప్రకటించిన ఈ ఫలితాల్లో జమ్మూ-కాశ్మీరుకు చెందిన రైల్వే అధికారి అథర్ అమీర్ యుఐ.షరీఫ్ ఖాన్ రెండో ర్యాంకును సాధించగా, ఢిల్లీకి చెందిన జస్మీత్ సింగ్ సంధు అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి మూడో ర్యాంకును దక్కించుకున్నాడు.

05/11/2016 - 04:23

న్యూఢిల్లీ, మే 10: కరవు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వెయ్యి కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కోరారు. కెసిఆర్ చెప్పినదంతా సావధానంగా విన్న మోదీ తెలంగాణకు చేయగలిగినంత సహాయం చేస్తామన్నారు. అయితే, ఎంత ఇచ్చేది, ఎప్పుడిచ్చేది మాత్రం స్పష్టం చేయలేదు.

05/11/2016 - 04:17

హైదరాబాద్, మే 10: మేడిగడ్డ బ్యారేజీ (కాళేశ్వరం ప్రాజెక్టు) నిర్మాణానికి తెలంగాణ, మహారాష్టల్ర మధ్య చర్చలు సఫలమయ్యాయి. మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌తో ముంబయిలో తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి వివరంగా చర్చించారు. హైదరాబాద్‌లో జరిగే గోదావరి అంతర్ రాష్ట్ర మండలి సమావేశానికి హాజరుకావాలని మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌ను హరీశ్‌రావు ఆహ్వానించారు.

05/11/2016 - 04:14

హైదరాబాద్, మే 10: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు మంచి నీరు అందించేందుకు నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల జలాశయానికి ఒక టిఎంసి నీటిని విడుదల చేస్తామని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో సిఎల్‌పి నేత కె.

05/11/2016 - 03:45

న్యూఢిల్లీ, మే 10: తెలుగు, తమిళం, మలయాళం,అస్సాం,బెంగాలీ, గుజరాత్ భాషల్లో ఎమ్‌బిబిఎస్, బిడిఎస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త ధర్మాసనాన్ని ఏర్పా టు చేస్తామని తెలిపింది.

05/11/2016 - 03:34

డెహ్రాడూన్, మే 10: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష మంగళవారం ముగిసింది. బుధవారం అదిధిరికంగా సుప్రీంకోర్టు ఫలితాలను ప్రకటించనున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బలపరీక్షలో విజయం సాధించారన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ వర్గాలు వేడుకలు జరుపుకొంటుండగా, బిజెపి సైతం పరోక్షంగా తన ఓటమిని అంగీకరించింది.

Pages