S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/11/2016 - 17:00

న్యూదిల్లి:ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో ప్రభుత్వం నెగ్గడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

05/11/2016 - 12:38

దిల్లీ: ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన బలపరీక్షలో మాజీ సిం హరీష్ రావత్ గెలిచినట్లు సుప్రీం కోర్టు బుధవారం ప్రకటించింది. బలపరీక్షకు 61 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా, వారిలో 33 మంది హరీష్ రావత్‌కు అనుకూలంగా చేతులెత్తారు. మంగళవారం ఉదయం బలపరీక్ష జరిగినప్పటికీ ఫలితాన్ని సీల్డ్‌కవర్‌లో ఉంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీం కోర్టుకు పంపారు.

05/11/2016 - 12:33

దిల్లీ: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. మేలురకం పసుపు విత్తనాలు, నూతన పద్ధతుల్లో సాగు, మద్దతుధర, మార్కెటింగ్ సౌకర్యాలు వంటి విషయాల్లో పసుపు రైతులను ఆదుకోవాలన్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే తెలంగాణలో ప్రత్యేకంగా పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

05/11/2016 - 12:32

పాట్నా: బిహార్‌లో అధికార జెడియు పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమ దేవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో మనోరమ కుమారుడు రాకీయాదవ్ గయలో ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. మంగళవారం రాకీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మనోరమ ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు అక్కడ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేశారు.

05/11/2016 - 07:14

న్యూఢిల్లీ, మే 10: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా చేయడం, వారికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయల కల్పన, ఉపాధ్యాయలు ఖాళీల భర్తీచేయలంటూ దాఖలైన పిటిషన్లును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.

05/11/2016 - 06:32

న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ పథకాల సబ్సిడీలు లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమచేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం (డిబిటి) అమలు తీరుపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. డిబిటివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయపడింది.

05/11/2016 - 06:29

న్యూఢిల్లీ, మే 10: మెట్రోపాలిటన్ నగరాల నుంచి.. ఈశాన్య రాష్ట్రాల్లో మామూలు గ్రామాల వరకు.. అన్ని ప్రాంతాల నుంచి భారతీయుల సంబంధాలు ‘పనామా’తో పెనవేసుకుని పోయాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 1100మంది అధికారులు, వ్యక్తులు, మధ్యవర్తులు.. 828 చిరునామాలు.. 22 కంపెనీలు.. అక్కడక్కడా పరిశీలిస్తేనే దాదాపు రెండువేల భారతీయ లింకులు ‘పనామా’ తాజా వ్యవహారంలో వెలుగుచూశాయి.

05/11/2016 - 06:27

న్యూఢిల్లీ, మే 10: తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై సోనియా భావోద్వేగ ప్రతిస్పందనను బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు. ‘ఇది నా దేశం. నా రక్తం, ప్రియమైన మీలో కలిసిపోయింది. నా తుది శ్వాస ఇక్కడే తీసుకుంటాను. నా చితాభస్మం ఇక్కడే కలిసిపోతుంది. భారత దేశం పట్ల నా అంకిత భావాన్ని, ప్రేమను ఆయన తీసుకుపోలేరు.

05/11/2016 - 06:24

న్యూఢిల్లీ, మే 10: ఆరు రాష్ట్రాలోని పది ఔషధ ఉత్పత్తిదారుల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో తెలియజేసింది.

05/11/2016 - 06:22

గయ, మే 10: బిహార్‌లోని గయ జిల్లాలో రెండు రోజుల క్రితం తన వాహనాన్ని ఓవర్‌టేక్ చేసినందుకు 20 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపాడన్న ఆరోపణపై అరెస్టయిన జెడి(యు) ఎమ్మెల్సీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ మాత్రం తాను ఆ యువకుడిపై కాల్పులు జరపలేదని, అసలు ఆ సంఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులకు చెప్పాడు.

Pages