జాతీయ వార్తలు

నగదు బదిలీతో నకిలీలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ పథకాల సబ్సిడీలు లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమచేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం (డిబిటి) అమలు తీరుపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. డిబిటివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయపడింది. 2015-2016 సంవత్సరంలో 61వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ పథకం కింద 30కోట్ల మంది లబ్ధిదారులుకు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. అందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ పథకం కింద 25వేల కోట్లు, ఎల్‌పిజి పహల్ పథకం కింద 21వేల కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఆధార్, డిబిటి కార్యక్రమాల అమలుపై రెండు గంటలపాటు సమావేశం జరిగింది. లబ్ధిదారుల్లో పొదుపు చర్యలు ప్రోత్సహించడానికి డిబిటి ఓ ప్రధాన వేదికగా ఉపయోగపడుతోందని పిఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది. నగదు బదిలీ పథకంవల్ల నకిలీ లబ్ధిదారుల ఆటకట్టించినట్టు తెలిపారు. పిఎంఓ అందించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులు ఏరివేశారు. దీనివల్ల సంక్షేమ పథకాలకు సంబంధించి 10వేల కోట్ల రూపాయలు ఆదా చేసినట్టయింది. పహల్ స్కీమ్ కింద 3.5 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరివేశారు. 2014-15 సంవత్సరంలో 14,000 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు పిఎంవో వెల్లడించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3000 వేల కోట్లు నిధులు దుర్వినియోగం కాకుండా చూశారు. ఇవి 2015-2016 సంవత్సరానికి చెందిన గణాంకాలే. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ మంచి ఫలితాలే వచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డిబిటిని అభివృద్ధి చేయాలని సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని శాఖలను ప్రధాని మోదీ ఆదేశించారు.

chitram నగదు బదిలీ పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ