జాతీయ వార్తలు

ఆమె పౌరసత్వాన్ని ఎవరు లాక్కుంటున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై సోనియా భావోద్వేగ ప్రతిస్పందనను బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు. ‘ఇది నా దేశం. నా రక్తం, ప్రియమైన మీలో కలిసిపోయింది. నా తుది శ్వాస ఇక్కడే తీసుకుంటాను. నా చితాభస్మం ఇక్కడే కలిసిపోతుంది. భారత దేశం పట్ల నా అంకిత భావాన్ని, ప్రేమను ఆయన తీసుకుపోలేరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మనోభావాలను అర్థం చేసుకోజాలరు.. కానీ మీరు అర్థం చేసుకుంటారు’ అని కేరళ ఎన్నికల ప్రచార సభలో సోనియా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ ‘సోనియా సహజంగానే పిరికిలక్షణం కలవారు. భారీ పదాలు వాడినంత మాత్రాన జరిగేదేముంది.. ఇప్పుడు అంత పెద్ద పెద్ద ప్రకటనలు చేయటం అవసరమా? ఆమె పౌరసత్వాన్ని ఎవరైనా లాక్కుంటున్నారా? ఆమె టెన్ జన్‌పథ్‌లో ఉన్నారా? తిహార్ జైల్లో ఉంటున్నారా అన్నది నేనేమీ చెప్పలేను. కానీ ఆమెను ఎవరూ ఈ దేశం నుంచి పంపిచేయటం లేదు’ అని అన్నారు. దేశం సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ధైర్యంగా ఎదుర్కోకుండా తప్పించుకోవటం ఆమె లక్షణమని సోనియా అని ఆయన విమర్శించారు. ‘‘1971లో బంగ్లాదేశ్‌తో యుద్ధం జరిగినప్పుడు పిల్లలతో పారిపోయారు. 1977లో ఇటాలియన్ దౌత్య కార్యాలయంలో దాక్కున్నారు. 1991లో ఆమె విలువైన నగలు, ఆభరణాలను ఒక ట్రక్‌లో ఉంచి విమానం ద్వారా సింగపూర్ పంపించి అక్కడ డిపాజిట్ చేశారు. సంక్షోభాల నుంచి తప్పించుకోవటం అన్నది ఆమె చరిత్ర’’ అని స్వామి వ్యాఖ్యానించారు.