S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/10/2016 - 14:18

దిల్లీ: తెలంగాణలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, లక్షలాది మంది పేదలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని టిడిపి ఎంపీ దేవేందర్ గౌడ్ మంగళవారం రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. కరవు నిధులిచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

05/10/2016 - 12:31

డెహ్రాడూన్: పదవీచ్యుతుడైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ‘బలపరీక్ష’ శాసనసభలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముగిసింది. బలపరీక్షలో గెలిచేందుకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా తనకు 34 మంది అండగా నిలిచారని రావత్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఓ మహిళా ఎమ్మెల్యే బిజెపి శిబిరంలో చేరగా, బిజెపి నుంచి ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు.

05/10/2016 - 12:08

నైనిటాల్: పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు బలపరీక్ష మొదలైంది. ఈ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. రెండు గంటల సేపు రాష్టప్రతి పాలనను సడలించి బలపరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు. చివరి నిమిషంలోనూ రాజకీయ వేదికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటన్నాయి.

05/10/2016 - 12:07

దిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు, రేపు జరగాల్సిన కాంగ్రెస్ యువనేత రాహుల్ ఎన్నికల పర్యటన రద్దయింది. అనారోగ్యం కారణంగా రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో పర్యటన రద్దయినట్లు రాహుల్ ట్విట్టర్‌లో తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ప్రస్తుతం రాలేకపోతున్నందుకు తనను ప్రజలు మన్నించాలని ఆయన కోరారు.

05/10/2016 - 12:06

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హత పరీక్ష (నీట్)లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మెడికల్ ఎంట్రన్స్‌లు జరిగాయని, ఆంగ్ల మాధ్యమానికి, నెగిటివ్ మార్కుల విధానానికి కొన్ని రాష్ట్రాల విద్యార్థులు ఇంకా అలవాటుపడలేదని ఈ కారణంగా వీరికి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది.

05/10/2016 - 11:28

పాట్నా: అధికార జెడియు ఎమ్మెల్సీ మనోరమ యాదవ్ కుమారుడైన రాకీ యాదవ్‌ను బిహార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తన కారును ఓవర్‌టేక్ చేశాడని ఆగ్రహించి ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని రాకీ యాదవ్ తుపాకీతో కాల్చిచంపాడు. నిందితులెంతటివారైనా చర్యలు తప్పవని సాక్షాత్తూ బిహార్ సిఎం నితీష్‌కుమార్ ప్రకటించడంతో పోలీసులు రంగంలోకి దిగి తన తండ్రికి చెందిన ఫ్యాక్టరీలో దాక్కున్న రాకీ యాదవ్‌ను అరెస్టు చేశారు.

05/10/2016 - 05:01

గయ/పాట్నా, మే 9: ఓ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన బీహార్ ఎమ్‌ఎల్‌సి కుమారుడు పరారీలోనే ఉన్నాడు. రెండో రోజైన సోమవారం కూడా అతడి జాడ తెలియలేదు. మరోపక్క ఈ ఘటనలో దోషుల్ని వదిలేది లేదని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉద్ఘాటించారు. శనివారం నాటి ఈ ఘటనకు నిరసనగా గయలో బంద్ నిర్వహించారు. ముఖ్యమంత్రి నితీశ్‌పై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు విరుచుకు పడుతున్నాయి.

05/10/2016 - 04:11

ఎంబీబీఎస్, బీడీఎస్‌లకే నీట్ ద్వారా అడ్మిషన్లు
నీట్-1 రాసిన వారు నీట్-2 రాయవచ్చు
నీట్-1ని వదులుకుంటేనే నీట్-2 రాసే వీలు
నీట్ -1 రాయని వారికి నీట్-2లో అవకాశం
ప్రాంతీయ భాషల్లో నిర్వహణ
ఏకీకృత అడ్మిషన్ల కోసమే ఈ ప్రయత్నం
జూలై 24న నీట్-2 పరీక్ష
అవసరమనుకుంటే పరీక్ష తేదీలో మార్పు
జస్టిస్ లోధా నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ

05/10/2016 - 03:52

న్యూఢిల్లీ, మే 9: ఉత్తరాఖండ్‌లో అనర్హత వేటుకు గురైన 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర శాసనసభలో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలుచేస్తూ వీరు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం డిస్మిస్ చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు పెద్ద ఊరట కల్పించింది.

05/10/2016 - 03:28

న్యూఢిల్లీ, మే 9: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఇక్కడ విడుదల చేసిన మోదీ డిగ్రీ పట్టాలు నకిలీవని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బిజెపి నేతల విలేఖరుల సమావేశం అయిన గంట తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ మీడియాతో మాట్లాడారు.

Pages